కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

ప్రత్యేకమైన రోజులను పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు (మే 1) కార్మిక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ఓ వింటేజ్ వీడియోని పోస్ట్ చేశారు చిరంజీవి. 22 సంవత్సరాల క్రితం.. పసి పిల్లలని పని పిల్లలుగా చేయొద్దని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కోసం చేసిన ‘చిన్ని చేతులు’ క్యాంపైన్ కి సంబంధించిన వీడియో అది. మే డే సందర్భంగా ఆ వీడియో రిలవెంట్ అవుతుందని షేర్ చేసినట్టు చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Related Posts