మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన భోళా శంకర్ ఈ శుక్రవారం విడుదలైంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించాడు. రిలీజ్ కు ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా.. మెగా మేనియా ఏదైనా పనిచేస్తుందని భావించారు ఫ్యాన్స్. బట్ రీమేక్ కావడం.. ఈ సినిమా ఆల్రెడీ తెలుగులో డబ్ అయ్యి ఉండటంతో పాటు దీనికి దగ్గరగానే రజినీకాంత్ పెద్దన్న సినిమా కూడా ఉండటం లాంటివన్నీ కలిసి భోళా శంకర్ పై బజ్ లేకుండా చేశాయి. ఊహించినట్టుగానే ఆడియన్స్ నుంచి యావరేజ్ టాక్ వచ్చింది. ఓ రకంగా డిజాస్టర్ అనే అంటున్నారు. అయినా మెగాస్టార్ కెపాసిటీకి తగ్గట్టుగా మొదటి రోజు కలెక్షన్స్ ఆశాజనకంగానే ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి 33 కోట్ల గ్రాస్ వసూలైంది. దాదాపు 20 కోట్ల వరకూ షేర్ వచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మెగా మూవీకి దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. ఒకప్పుడు ఒక ఏరియాలోనే సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు రెండు స్టేట్స్ లోనూ వచ్చాయి.
ఇక ఈ మూవీ వంద కోట్ల టార్గెట్ తో విడుదలైందంటున్నారు. ఆ మొత్తం రికవర్ చేయడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. కాకపోతే ఈ వీకెండ్ తో పాటు ఇండిపెండెన్స్ డే వరకూ టైమ్ ఉంది కాబట్టి మరీ తక్కువ కాకుండా కాస్త పెద్ద అమౌంట్ నే కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా ఈ మధ్య కాలంలో రీమేక్ మూవీస్ మెగా ఫ్యామిలీకి పెద్దగా కలిసి రావడం లేదు అనే చెప్పాలి.