అన్నదమ్ములు తేలిపోయారు.. కొడుకైనా కొడతాడా..

కొన్ని రోజుల క్రితం ఇది మెగానామ నెల అనుకున్నారు చాలామంది. అంటే ఒక నెల రోజుల్లోనే మూడు మెగా ఫ్యామిలీ మూవీస్ వస్తున్నాయి. ఇక ఫ్యాన్స్ కు పండగే అని దానర్థం. జూలై 28న పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా వచ్చింది. ఈ మూవీపై పెద్దగా అంచనాలు లేవు కానీ.. మామా అల్లుళ్లు కలిసి నటించారు కాబట్టి ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ జరుగుతుందని భావించారు. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. పైగా తెలుగు వెర్షన్ కోసం త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. దీని వల్ల సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే భావించారు. బట్ అలాంటిదేం జరగలేదు. సినిమా పోయింది. అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ ను ఆ పాత్రలో చూసి నిట్టూర్చారు. ఏ మాటకు ఆ మాటే.. పవన్ మాత్రం చాలా రోజుల తర్వాత ఎనర్జిటిక్ అండ్ ఎంటర్టైనింగ్ గా కనిపించాడు.


ఇక నెక్ట్స్ మెగాస్టార్ మూవీ భోళా శంకర్ అనుకున్నారు. ఇదీ వచ్చింది. విశేషం ఏంటంటే.. ఈ మూవీపైన అంచనాలు లేవు. అయినా మెగాస్టార్ కదా.. ఏదైనా చేస్తాడు అనుకున్నారు.కానీ.. ఈ సినిమా ఒప్పుకోవడమే ఆయన చేసిన తప్పు అని ప్రేక్షకులే కాదు.. ఫ్యాన్స్ కూడా బలంగా ఫీలయ్యారు. ఆ రేంజ్ లో నిరాశపరిచింది భోళా శంకర్. అవుట్ డేటెడ్ కథ, కథనాలతో తనూ అవుట్ డేటెడ్ అని చెప్పకనే చెప్పుకున్నాడు దర్శకుడు మెహర్ రమేష్‌. అలా ఈ రెండు సినిమాలూ మెగా ఫ్యాన్స్ కు కొత్త జోష్ఇస్తాయి అనుకుంటే కొండంత నిరాశను నింపాయి. అయితే ఈ రెండు సినిమాలూ రీమేక్ లు. అంచనాలు తగ్గడానికి.. ఆకట్టుకోలేకపోవడానికీ అదే ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు.

ఇక మెగానామ నెలలో రాబోతోన్న మరో మెగా హీరో వరుణ్ తేజ్.ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన సినిమా గాండీవధార