తెలుగు పిల్లకు హ్యాట్రిక్ మిస్ అయిందా..

కొన్నాళ్లుగా తెలుగు తెరపై తెలుగు హీరోయిన్లు సందడి చేస్తున్నారు. అంతేకాదు.. మంచి విజయాలూ అందుకుంటున్నారు. ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్న శ్రీ లీల హాఫ్ తెలుగు అమ్మాయి. బేబీతో ఓవర్ నైట్ బ్లాక్ బస్టర్ బ్యూటీ అనిపించుకుంది వైష్ణవి చైతన్య. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోన్న కావ్య కళ్యాణ్‌ రామ్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే హాట్ టాపిక్ గా మారింది. తను ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కు చేరువవుతుంది అనుకుంటున్న టైమ్ లో ఉస్తాద్ అమ్మడి స్పీడ్ కు బ్రేకులు వేశాడు అనే టాక్ వినిపిస్తోంది.

ఈ శనివారం విడుదలైన ఉస్తాద్.. రిలీజ్ కు ముందు మంచి పాజిటివ్ వైబ్స్ తెచ్చుకుంది. టీజర్ బావుంది. ట్రైలర్ అంచనాలు పెంచింది. పాటలు బావున్నాయి. వీటిలో కావ్య, శ్రీ సింహాల కెమిస్ట్రీకి ఆడియన్స్ రిలీజ్ కు ముందే ఫిదా అయిపోయారు. దీంతో కుర్రాడు హిట్ కొడుతున్నాడు అనిపించుకున్నాడు. దీనికి తోడు మెగాస్టార్ భోళా శంకర్ ఉన్నా రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నారంటే సినిమాలో మేటర్ గట్టిగానే ఉందనుకున్నారు. బట్ అంత లేదు అనే టాక్ వచ్చేసింది.


ఉస్తాద్ టైటిల్ లో ఉన్న బలం కథ, కథనాల్లో లేదు అంటున్నారు. దీంతో శ్రీ సింహాకు మరోసారి నిరాశ తప్పలేదు. గత నెలలోనే భాగ్ సాలే సినిమాతో వచ్చాడు శ్రీ సింహా. ఈ మూవీతో అయినా హిట్ కొడతాడు అనుకుంటే అతని ఆశలు నెరవేరలేదు. ఇక ఉస్తాద్ ఫ్లాప్ తో తెలుగు పిల్ల కావ్య కళ్యాణ్‌ రామ్ కు హ్యాట్రిక్ మిస్ అయింది. తను బలగం, మసూద వంటి చిత్రాల హిట్స్ తో జోష్‌ లో ఉంది. ఆ జోష్‌ కు బ్రేక్ వేసింది ఉస్తాద్. ఇప్పటి వరకూ ఉన్న రిపోర్ట్స్ ను బట్టి చూస్తే ఈ సినిమా పోయినట్టే అని తేలిపోయింది. మొత్తంగా హ్యాట్రిక్ హిట్స్ తో తెలుగులో నెక్ట్స్ లీగ్ లోకి వెళుతుందనుకున్న కావ్య ఈ ఫ్లాప్ తో డిజప్పాయింట్ అవుతుందనే చెప్పాలి.

Related Posts