కవల సోదరుల దర్శకత్వంలో కమల్ హాసన్

‘విక్రమ్’ విజయం తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్ సినిమాల స్పీడు మామూలుగా లేదు. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెడుతున్నాడు. ఈకోవలోనే లేటెస్ట్ గా ఫైట్ మాస్టర్స్ అన్బారివ్ డైరెక్షన్ లో ఓ సినిమాని చేయబోతున్నాడు. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. కమల్ నటించే 237వ సినిమా ఇది కానుంది.

కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’తో పాటు.. ప్రస్తుతం మణిరత్నంతో చేస్తున్న ‘థగ్ లైఫ్’కి కూడా అన్బారివ్ ఫైట్ మాస్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇక.. లేటెస్ట్ గా ‘సలార్’తో ఈ ట్విన్స్ చేసిన యాక్షన్ మాయాజాలం గురించి చూశాం. ‘గేమ్ ఛేంజర్, ఇండియన్ 2’ వంటి సినిమాలకు కూడా అన్బారివ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. మొత్తంమీద.. సౌత్ లో నంబర్ 1 ఫైట్ మాస్టర్స్ గా కొనసాగుతోన్న అన్బారివ్.. కమల్ హాసన్ తో తీయబోయే సినిమాను ఏ రేంజులో డిజైన్ చేస్తారో చూడాలి.

Related Posts