‘పుష్ప 2’కి అక్కడ పోటీ మామూలుగా లేదు

బాలీవుడ్ కి దీటుగా ఎదిగిన సౌత్ ఇండస్ట్రీ.. బీటౌన్ స్టార్స్ కి సవాలు విసురుతూనే ఉంది. ఒకప్పుడు బాక్సాఫీస్ క్లాషెస్ ను సాధ్యమైనంత వరకూ తగ్గించుకునేలా చూసేవారు బాలీవుడ్ హీరోలు. అయితే.. ఇప్పుడు ఏరికోరి సౌత్ సినిమాలతో బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతున్నారు. పోయినేడాది డిసెంబర్ లో బాలీవుడ్ మూవీ ‘డంకి‘.. సౌత్ సెన్సేషనల్ మూవీ ‘సలార్‘ మధ్య బాక్సాఫీస్ క్లాష్ వచ్చింది. అయితే.. ఈ క్లాష్ లో ‘సలార్’ డిస్టింక్షన్ లో పాసైంది. గతేడాది బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ విజయాలందించిన షారుక్ ‘డంకీ’తో దెబ్బతిన్నాడు.

ఇక ఈ ఏడాది అలాంటిదే ఓ సౌత్, నార్త్ క్లాష్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిస్కషన్స్ కు కారణమవుతోంది. అదే ‘పుష్ప 2’ వర్సెస్ ‘సింగమ్ అగైన్’. పేరుకు రెండు సీక్వెల్ మూవీసే. పైగా.. రెండు సినిమాలపైనా అంచనాలైతే భారీ స్థాయిలోనే ఉన్నాయి. ముందుగా సౌత్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించడానికి ఈ ఏడాది ఆగస్టు 15న రాబోతుంది ‘పుష్ప 2‘. ఇప్పటికే యావత్ భారతదేశంలో ‘పుష్ప‘ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. దీంతో ‘పుష్ప 2‘పై అంచనాలు మూడు, నాలుగు రెట్లు పెరిగాయి. ఇక.. ‘పుష్ప 2‘ ఉన్నా.. అదే డేట్ కి ఫిక్సైంది బాలీవుడ్ మూవీ ‘సింగమ్ అగైన్‘.

రోహిత్ శెట్టి ‘సింగమ్‘ సిరీస్ లోని థర్డ్ ఇన్ స్టాల్ మెంట్ ‘సింగమ్ అగైన్‘. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ పోలీసాఫీసర్ గా టైటిల్ రోల్ లో కనిపించబోతున్నాడు. దీపిక పదుకొనె కూడా పోలీసాఫీసర్ గా దుమ్మురేపడానికి సిద్ధమవుతోంది. ఇంకా ఈ మూవీలో మరో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ని కూడా తీసుకున్నారు. అలాగే.. అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ వంటి వారు కేమియోస్ లో మురిపించే అవకాశాలూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. మొత్తానికి.. ఆగస్టులో ‘పుష్ప2 వర్సెస్ సింగమ్ అగైన్‘ క్లాష్ అయితే సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.

Related Posts