మెగాటీమ్ అంచనాలను అందుకుంటుందా..?

ఒక పెద్ద సినిమా విడుదలవుతోంది అంటే ఆడియన్స్ లో ఎంత ఆసక్తి ఉంటుందో అందరికీ తెలుసు. ఇక ఆ పెద్ద సినిమాలో ఇద్దరు పెద్ద హీరోలు కూడా ఉంటే.. ఇండస్ట్రీ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుందా సినిమా కోసం. తండ్రి కొడుకులే అయినా టాప్ స్టార్స్ గానూ ఉన్న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ఎలా ఉన్నాయి.. ఆచార్య ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ అవుతుందా..?

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అందుకే ఆచార్యపై ముందు నుంచీ అంచనాలున్నాయి. అసలు కొరటాల డైరెక్షన్ లో సినిమా అన్నప్పుడే అంతా ఆసక్తిగా చూశారు. దీనికి తోడు రామ్ చరణ్ కూడా యాడ్ అయ్యాక బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం అనుకున్నారంతా. ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన ఆచార్యను ఆర్ఆర్ఆర్ కోసం ఆపారు. ఫైనల్ గా ఈ 29న విడుదల కాబోతోందీ మూవీ. చిరంజీవి, చరణ్ ల స్క్రీన్ ప్రెజెన్స్ చాలు అనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. అంతకు మించిన కథ ఉంటుందంటున్నాడు కొరటాల. పైగా వరుసగా చేస్తోన్న ఇంటర్వ్యూస్ తో మరిన్ని అంచనాలను పెంచుతున్నారు.

మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా జాయిన్ అయిన కాజల్ ను తాజాగా తప్పించామని చెప్పాడు కొరటాల. అంటే ఇందులో కాజల్ పాత్ర ఉండదన్నమాట. చిత్రీకరణ పూర్తయ్యాక విడుదలకు ముందు ఈ ప్రకటన చేయడం కొంత ఆశ్చర్యమే అయినా.. అందుకు వారి కారణాలు వారికి ఉన్నాయి అంటున్నారు. మరి లాహే లాహే పాటలో అయినా ఉంటుందా లేదా అని కూడా సినిమాలోనే చూడాలట. ఇటు చరణ్ కు జోడీగా నటించిన పూజాహెగ్డే పాత్ర అలాగే ఉంటుంది. సిద్ధగ చరణ్, ఆచార్యగా చిరంజీవి నక్సలైట్స్ గానూ.. ఇటు హిందూ ధర్మాన్ని రక్షించే వ్యక్తులుగా కనిపించడం కాంట్రాస్ట్ లా కనిపిస్తున్నా.. ఈ రెండు అంశాలను ఎలా మిక్స్ చేశాడు దర్శకుడు అనే ఆసక్తి కూడా ఉంది. ఏదేమైనా ఆచార్య పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. కలెక్షన్స్ పరంగా రికార్డులను, కంటెంట్ పరంగా రివ్యూవర్స్ ను కొల్లగొడితే ఆ అంచనాలను అందుకోవడం ఏమంత కష్టం కాదు.

Related Posts