వెంకటేష్ తో జోడీ కడుతోన్న త్రిష

చెన్నై సోయగం త్రిష.. తమిళంలోనే కాదు తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్ తో ‘థగ్ లైఫ్‘ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్ లో లేటెస్ట్ గా జాయిన్ అయ్యింది త్రిష. అలాగే.. అల్టిమేట్ స్టార్ అజిత్ నటిస్తున్న ‘విదా ముయార్చి‘లోనూ కథానాయికగా నటిస్తుంది.

తెలుగు విషయానికొస్తే.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్ అందరినీ కవర్ చేసిన అతికొద్ది మందిలో త్రిష ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో పాటు.. పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి నేటితరం స్టార్స్ తోనూ నటించిన అరుదైన ఘనత త్రిష సొంతం. ఇక.. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీ అవుతోంది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర‘లో నాయికగా నటిస్తున్న త్రిష.. లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ తోనూ నటించే ఛాన్స్ అందుకుందట. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాడు. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఈ మూవీలో వెంకీకి జోడీగా త్రిష ను ఎంపిక చేశారట. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేష్ తో ‘నమో వెంకటేషా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే‘ వంటి సినిమాల్లో నటించింది త్రిష.

Related Posts