శ్రీవిష్ణు చేయబోయే కామెడీ హంగామా ‘ఓం భీమ్ బుష్..‘

టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే హీరోల్లో శ్రీవిష్ణు ముందు వరుసలో ఉంటాడు. ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాడు. ఒక్కోసారి ఫెయిల్యూర్స్ వచ్చినా తన రూట్ మాత్రం మార్చుకోడు. ‘భలా తందనాన, అల్లూరి‘ వంటి సినిమాలతో శ్రీవిష్ణుకు సరైన ఫలితాలు దక్కలేదు. అయినా.. ఆ తర్వాత ‘సామజవరగమన‘తో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. పక్కింటబ్బాయి తరహా ఇమేజ్ తో దూసుకెళ్తున్న శ్రీవిష్ణు లేటెస్ట్ గా ‘ఓం భీమ్‌ బుష్‌’ అనే ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు.

శ్రీవిష్ణుతో పాటు.. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి కామెడీ స్టార్స్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరు ముగ్గురూ కలిసి ‘నో లాజిక్‌.. ఓన్లీ మ్యాజిక్‌‘ అంటూ ‘ఓం భీమ్ బుష్‘ మూవీతో ఫుల్ గా ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. ‘హుషారు‘ ఫేమ్ హర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తుంది. మార్చి 22న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts