నిర్మాతగా మారుతోన్న స్టార్ రైటర్

తెలుగులో పరుచూరి బ్రదర్స్ తర్వాత అగ్ర కథానాయకుల చిత్రాలకు మళ్లీ ఆ రేంజ్ డిమాండ్ ఉన్న రచయితగా పేరు సంపాదించుకున్నాడు సాయి మాధవ్ బుర్రా. నాటకాలతో ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత బుల్లితెరపై పలు ధారావాహికలకు కథ, మాటలు సమకూర్చిన సాయి మాధవ్ బుర్రా.. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ డిమాండె ఉన్న రైటర్. క్రిష్ దర్శకత్వం వహించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రంతో రచయితగా వెండితెరకు పరిచయమైన సాయిమాధవ్.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కి మాటల రచయితగా పనిచేశాడు. జోనర్ ఏదైనా.. తన పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆ సినిమాకి సరికొత్త జోష్ తీసుకురావడంలో సాయిమాధవ్ దిట్ట.

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఎడి‘, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు‘, చిరంజీవి ‘విశ్వంభర‘ చిత్రాలకు రచయితగా పనిచేస్తున్నాడు. విలక్షణ దర్శకుడు క్రిష్.. అనుష్కతో తెరకెక్కించే సినిమాకీ సాయిమాధవ్ సంభాషణలు సమకూర్చనున్నాడు. ఒకవైపు రచయితగా బిజీగా సాగుతూనే.. మరోవైపు నిర్మాతగా తొలి అడుగులు వేయబోతున్నాడు.

సాయిమాధవ్ స్క్రిప్ట్స్.. షార్ట్ ఫామ్ లో ‘ఎస్.ఎమ్.ఎస్‘ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నాడు ఈ స్టార్ రైటర్. తొలి ప్రయత్నంగా ఈటీవి విన్ తో కలిసి ఓ సినిమాని నిర్మించే సన్నాహాల్లో ఉన్నాడు. తానే స్క్రిప్ట్ మొత్తం పూర్తిచేసి.. ఓ కొత్త దర్శకుడిని పనిచయం చేయనున్నాడట. త్వరలోనే సాయిమాధవ్ బుర్రా ప్రొడ్యూసర్ గా వ్యవహరించే ఫస్ట్ మూవీకి సంబంధించి డిటెయిల్స్ రానున్నాయి.

Related Posts