నాల్గవసారి వెంకటేష్ తో జోడీ కడుతున్న త్రిష

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా లాంగ్ కెరీర్ కొనసాగిస్తున్న బ్యూటీ త్రిష. ఈ చెన్నై సోయగం.. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే తమిళంలో కమల్ హాసన్, అజిత్ లతో ఆడిపాడుతోంది ఈ సీనియర్ బ్యూటీ. మరోవైపు తమిళం కంటే మిన్నగా తెలుగులోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది.

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్ అందరినీ కవర్ చేసిన అతికొద్ది మందిలో త్రిష ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో పాటు.. పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి నేటితరం స్టార్స్ తోనూ నటించిన అరుదైన ఘనత త్రిష సొంతం. ఇక.. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీ అవుతోంది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర‘లో నాయికగా నటిస్తున్న త్రిష.. లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ తోనూ నటించే ఛాన్స్ అందుకుందట. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాడు. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవుతున్నాయి.

ఆద్యంతం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ మూవీలో త్రిషను హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారట. గతంలో వెంకటేష్ తో కలిసి ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, నమో వెంకటేష, బాడీగార్డ్’ చిత్రాలలో నటించింది త్రిష. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాల్లో అదరహో అనిపించింది.

Related Posts