నితిన్ బర్త్ డే స్పెషల్ గా క్రేజీ అప్డేట్స్

యూత్ స్టార్ నితిన్ పుట్టినరోజు ఈరోజు (మార్చి 30). ఈ సందర్భంగా నితిన్ కొత్త సినిమాల నుంచి కొత్త లుక్స్ విడుదలయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ తో నితిన్ నటిస్తున్న చిత్రం ‘తమ్ముడు‘. ‘ఎమ్.సి.ఎ, వకీల్ సాబ్‘ ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ సరికొత్తగా, విభిన్నంగా ఆకట్టుకుంటుంది.

‘తమ్ముడు’ చిత్రంలో నితిన్ లుక్ చాలా కొత్తగా ఉంది. పోస్టర్‌ ను గమనిస్తే ఓ బస్సు మీద చిన్నిపాటి గడ్డంతో నితిన్ కూర్చుని ఉన్నారు. ఆయన చేతిలో సుబ్రహ్మణ్యస్వామి ఆయుధమైన శూలం ఉంది. ఆయన చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి. బస్సును ఓ మహిళ డ్రైవ్ చేస్తోంది. బస్సులో సీనియర్ నటి లయ కనిపిస్తున్నారు.

ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘దిల్, శ్రీనివాస కళ్యాణం‘ వంటి సినిమాల తర్వాత శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నితిన్ చేస్తోన్న మూడో సినిమా ‘తమ్ముడు’.

మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నితిన్ నటిస్తున్న ‘రాబిన్ హుడ్‘ నుంచి స్పెషల్ టీజర్ రిలీజయ్యింది. ‘భీష్మ‘ తర్వాత వెంకీ కుడుమలతో నటిస్తున్న ఈ మూవీ నుంచి స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజయ్యింది.

Related Posts