అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా పుష్ప.. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అర్జున్ నటనకు ఎంటైర్ కంట్రీ ఫిదా అయిపోయింది. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు, సమంత ఐటమ్ సాంగ్ తో పాటు మేనరిజమ్స్ డైలాగ్స్ అన్నీ ఫేమ్ అయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఆర్టిస్టులు, ఇతర సెలబ్రిటీస్ అంతా ఒక్కసారైనా “తగ్గేదే లే” అనుకుండా లేరంటే ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు పుష్ప 2తో వస్తున్నారు.

ఫస్ట్ పార్ట్ లో పుష్ప ఎదిగిన విదానం చూపించారు. సెకండ్ పార్ట్ లో అతను పెద్ద డాన్ గా ఎదిగే క్రమం ఉంటుందట. ఫస్ట్ పార్ట్ లో ప్రాపర్ విలన్ లేడు. ఉన్నవాళ్లంతా పుష్పరాజ్ కు దీటైన వారు కాదు. సెకండ్ పార్ట్ కు ఆ ప్రాబ్లమ్ లేదు. పోలీస్ గా నటించిన భైరాన్ సింగ్ షెకావత్ ఉన్నాడు.

జాలి రెడ్డీ ఉన్నాడు. అయితే ఈ రెండు పాత్రలను కూడా సెకండ్ పార్ట్ లో ఇంటర్వెల్ టైమ్ కే ఎండ్ చేసి అంతకంటే పెద్ద విలన్స్ ను సెట్ చేస్తాడట సుకుమార్. ఆ విలన్స్ తో మూడో భాగం ఉండబోతోందంటున్నారు. యస్.. ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉందని కన్ఫార్మ్ చేశాడు సుకుమార్.


పుష్ప1 తర్వాత పుష్ప 2 వెంటనే స్టార్ట్ అయింది. అయితే మూడో భాగం రావడానికి మాత్రం ఓ ఐదేళ్ల టైమ్ పడుతుందట. అంత లాంగ్ టైమ్ అంటే ఈ పుష్ప మేనియా తగ్గొచ్చు. అయినా వీరు తగ్గేదే లే అనే బ్యాచ్ కాబట్టి అప్పటికి కావాల్సినంత క్రేజ్ ను క్రియేట్ చేస్తారు. మరి అంత లాంగ్ గ్యాప్ ఎందుకు అంటే.. ఆల్రెడీ సుకుమార్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ లు రెండున్నాయి.

ఆ రెండూ పూర్తి కావడానికి నాలుగేళ్ల టైమ్ పడుతుంది. ఈ టైమ్ అల్లు అర్జున్ కూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇద్దరి ప్రాజెక్ట్స్ పూర్తవడానికి మరీ ఐదేళ్లు కాకపోయినా నాలుగేళ్లైనా పడుతుంది. అప్పుడు మళ్లీ ఈ క్రేజీ కాంబోలో పుష్ప3 ఉంటుందట. మరి అప్పటి వరకూ రష్మిక మందన్నా కూడా ఇదే గ్లామర్ ను మెయిన్టేన్ చేస్తుందా..?