సమంత వచ్చేలా లేదు.. ? ఇప్పుడెలా ..?

స్టార్ హీరోయిన్ గా తెలుగులో ఓ వెలుగు వెలిగింది సమంత. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నటించింది. కానీ అనూహ్యంగా విడిపోయిందీ జంట. అప్పటి నుంచీ మరింత స్పీడ్ పెంచింది. వరుసగా కొత్త సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోదాం అనుకుంది. సైన్ చేసింది కూడా. విజయ్ దేవరకొండ సరసన శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ, ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్, ఫ్యామిలీ మేన్ దర్శకులతో మరో వెబ్ సిరీస్ లకు సైన్ చేసింది. వీటిలో మొదటిది యశోద.

రీసెంట్ గా రిలీజ్ అయిన మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఓటిటిలో ఉన్నా.. పెద్దగా టాక్ అయితే లేదు. ఖుషీ సినిమా 70 చిత్రీకరణ జరుపుకున్న తర్వాత సడెన్ గా సిక్ అయింది. తనకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకింది. దీంతో గత ఆగస్ట్ లోనే ఈ చిత్రం ఆగిపోయింది.

అప్పటి నుంచీ విజయ్ దేవరకొండ కూడా ఖాళీగానే ఉంటున్నాడు. లైగర్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసిన అతను ఈ ఖుషీ మూవీపై అంచనాలు పెట్టుకున్నాడు. అటు చూస్తే సమంత రీసెంట్ గా మరో ఆరు నెలల వరకూ షూటింగ్ కు రాలేను అని చెప్పిందట. ఇక చేసేదేం లేక విజయ్ దేవరకొండ తర్వాతి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు.

గౌతమ్ తిన్ననూరితో సితార బ్యానర్ లో సినిమాకు సైన్ చేశాడు. ఇక ఫ్యామిలీ మేన్ దర్శకులు కూడా ఆల్టనేషన్ చూసుకోవడంలో బిజీగా ఉన్నారట. కాకపోతే హలీవుడ్ వాళ్లు మాత్రం ఇంకా సమంత కోసం ఎదురుచూస్తున్నారని తెలిసింది. అయితే వారికి తను మరో ఆరు నెలల వరకూ షూటింగ్స్ కు రాలేదు అనే సంగతి తెలుసో లేదో మరి.


మొత్తంగా సమంతకు సోకిన వ్యాధి వల్ల తన ఫేస్ తో పాటు ఫిజిక్ లో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండూ సరిగ్గా లేకుండా ఏ నటుడు/నటి కెమెరాను ఫేస్ చేయలేదు కదా..? అందుకే సమంత కూడా మునుపటి “గ్లో” వచ్చే వరకూ ఆగాలనుకుంటోందట.

మరి అన్ని రోజులు ఆగితే తను షేప్ అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కదా..? మొత్తంగా ఇప్పటి వరకూ ప్రారంభం కాని సినిమాలకు వచ్చే సమస్యేం లేదు కానీ.. 70 శాతం షూటింగ్ జరుపుకుని ఉన్న ఖుషీ నిర్మాతలకే సమస్య. మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మిస్తోన్న ఈ చిత్రం కోసం వాళ్లు ఇంకేదైనా కొత్త నిర్ణయం తీసుకుంటారా లేక సమంత వచ్చే వరకూ ఆగుతారా అనేది చూడాలి.

Related Posts