వీళ్లు ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా..?

కాంబినేషన్ క్రేజ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ అన్నిసార్లూ అది వర్కవుట్ కాదు. ఒకటీ రెండు సార్లు అయితే మాత్రం సెంటిమెంట్ గా మారుతుంది. క్రేజ్ ఉంది అని చెప్పలేం కానీ.. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అయింది.

ఈ యేడాదే అనూహ్యంగా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకున్న కార్తికేయ2 కాంబో రిపీట్ అయింది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ2 రెగ్యులర్ మూవీ కాదు. దీంతో ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్, డ్యూయొట్స్ లాంటివేం లేవు.

కేవలం ఓ పాయింట్ చుట్టూనే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వీరు నటించిన 18 పేజెస్ సినిమా ఓ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. కుమారి 21ఎఫ్‌ ఫేమ్ సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించింది. ఈ నెల 23న విడుదల కాబోతోన్న18 పేజెస్ తో ఈ కపుల్ రిపీట్ అయింది.


ఆల్రెడీ ఓ బ్లాక్ బస్టర్ మూవీలో కలిసి నటించారు అంటే వారి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉండే ఉంటుంది. అది నెక్ట్స్ మూవీలో వారి మధ్య వచ్చే సీన్స్ లో ఈజ్ ను పెంచుతుంది. గత సినిమాలో రొమాన్స్ లేకపోయినా.. ఈ మూవీలో ఉండేలా కనిపిస్తోంది. సో.. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాల్లో వారి నటన ఖచ్చితంగా ఇంకా మెచ్యూర్డ్ గా ఉంటుంది.

ఇక ఇప్పటికే వచ్చిన టీజర్ తో పాటు పాటలకు మంచి స్పందన వస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లాగానే వీరి రెండో బ్యానర్ లో కూడా ఈ మధ్య ప్రామిసింగ్ సినిమాలే వస్తున్నాయి. కాస్త బలమైన కంటెంట్ కనిపిస్తోంది. ఈ దర్శకుడు సూర్య ప్రతాప్ కూడా మేటర ఉన్నవాడే.

పైగా ఈ మూవీ ప్రొడక్షన్ సుకుమార్ రైటింగ్స్ కూడా ఉంది. అన్నీ కలిపి 18పేజెస్ పై పూర్తి పాజిటివిటీ పెంచుతున్నాయి. మరి ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు ఈ కపుల్ కార్తికేయ2 మ్యాజిక్ ను రిపీట్ చేసి.. ప్యాన్ ఇండియా అంత కాకపోయినా తెలుగు స్టేట్స్ లో అయినా పెద్ద విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts