శ్రుతి హాసన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

అందాల శ్రుతి హాసన్ కు 2023వ సంవత్సరం చాలా లక్కీ ఇయర్ అని చెప్పాలి. బహు భాషా నటి అయిన శ్రుతి లాస్ట్ ఇయర్ కేవలం తెలుగు సినిమాల వరకే పరిమితమైంది. అయినా.. అన్ని సినిమాలు విజయాలు సాధించడం విశేషం. గత సంక్రాంతి కానుకగా నటసింహం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి‘, మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య‘ చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ లో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాల్లోనూ నాయిక శ్రుతి హాసన్. ఆ తర్వాత ‘హాయ్ నాన్న‘లో స్పెషల్ సాంగ్ లో మెరిసిన శ్రుతి.. ప్రభాస్ ‘సలార్‘తో మరో మెమరబుల్ హిట్ అందుకుంది.

ఇక.. ఈ ఏడాది శ్రుతి హాసన్ నుంచి ‘డెకాయిట్‘ సినిమా రాబోతుంది. అడవి శేష్, శృతి హాసన్ యూనిక్ కాంబినేషన్ లో వైవిధ్యభరితమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో శేష్, శృతి ఇద్దరూ దొంగలుగా కనిపించబోతున్నారు. షానియల్ డియో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. ఇంకా.. ప్రభాస్ ‘సలార్ 2‘ కూడా ఈ ఏడాదే పట్టాలెక్కబోతుంది. ఈ సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

Related Posts