నెట్ ఫ్లిక్స్ లో సలార్ వర్సెస్ యానిమల్

ఇరవై రోజుల గ్యాప్ లో ఆడియన్స్ ముందుకొచ్చిన రెండు పాన్ ఇండియా మూవీస్ ‘సలార్, యానిమల్‘. వరుస ఫ్లాపులతో సతమతమైన ప్రభాస్ ను మళ్లీ సిల్వర్ స్క్రీన్ రారాజుగా నిలిపిన చిత్రం ‘సలార్‘. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ థియేటర్లలో దుమ్మురేపి.. జనవరి 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీ జయంట్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే విడుదలైన అన్ని భాషల్లో ‘సలార్‘ ఇండియా వైడ్ ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది. రెండు, మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ లోకి వెళ్లింది.

‘సలార్‘ స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన వారం రోజులకే.. మరో బ్లాక్ బస్టర్ హిట్ ‘యానిమల్‘ని దింపింది నెట్ ఫ్లిక్స్. రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 26 నుంచి ‘యానిమల్‘ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ‘యానిమల్‘కి కూడా ఓ రేంజులో వ్యూవర్ షిప్ వస్తోంది. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రూపొందిన రణ్ బీర్ కపూర్ ‘యానిమల్‘ కల్ట్ హిట్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు కలెక్షన్లను కొల్లగొట్టింది. మొత్తానికి.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ‘సలార్‘ వర్సెస్ ‘యానిమల్‘ క్లాష్ కొనసాగుతోంది.

Related Posts