రామ్ చరణ్‌ కు అంత స్టేచర్ ఉందంటారా..?

కొన్ని కథలు చేయాలంటే ఆ హీరోలకు ఓ స్టేచర్ ఉండాలి అంటారు. ముఖ్యంగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న కథలకు ఇది చాలా ఇంపార్టెంట్. మాస్ లో ఎంత ఫాలోయింగ్ ఉన్నా.. రేంజ్ ఎంత పెద్దది అయినా.. ఓ పొలిటికల్ సబ్జెక్ట్ ను డీల్ చేయాలంటే అతని పర్సనల్ క్యారెక్టర్ ను కూడా చూస్తారు జనం. ఇలా చూస్తే ఇప్పుడు రామ్ చరణ్‌ చేస్తోన్న సినిమా విషయంలో ఎన్నో డౌట్స్ ఉన్నాయి. అతను రాజకీయ నేపథ్యంలో సినిమా చేస్తే జనం చూస్తారా అనేది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం సినిమానే చెబుతుంది కానీ.. అసలింతకీ అతను చేస్తోన్న ఈ కథేంటీ..? దీని నేపథ్యం ఏంటీ.?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఇప్పుడు ప్రూవ్డ్ స్టార్. స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ఉంది. తండ్రి చాటు తనయుడు అనే ట్యాగ్ ను ఎప్పుడో తొలగించుకున్నాడు. ఇంకా చెబితే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్‌ తండ్రి చిరంజీవి అని చెప్పుకునే స్థాయికి చేరాడు. అయితే ఈ ఇద్దరూ కలిసి చేసిన ఆచార్య పెద్ద డిజాస్టర్ అయినా.. అభిమానులకు మాత్రం తండ్రి కొడుకులను ఒకే ఫ్రేమ్ లో చూసిన ఆనందాన్ని ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ తో ఎపిక్ హిట్ అందుకున్న చరణ్‌ తర్వాతి ప్లానింగ్ కూడా పక్కగా ఉంది. ఇండియాస్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడైన శంకర్ తో సినిమా చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ఇది. దీంతో పాటు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా ఓకే అయింది. మరోవైపు కన్నడ దర్శకుడు నర్తన్ తో ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందనే టాక్ ఉంది.

ఈ కాంబినేషన్ గురించిన అనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందనేది టాలీవుడ్ టాక్. అయితే ముందుగా చేస్తోన్న శంకర్ సినిమా విషయంలోనే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్‌ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్రలో ఆయన నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడుగా కనిపిస్తాడు. మరో పాత్రలో కలెక్టర్. ఈ రెండు పాత్రల మధ్య రెండు వ్యవస్థలతో కూడిన కాంట్రాస్ట్ వస్తుందట. దీన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ నాయకుడిప్రత్యర్థులు ఆయన్ని అంతం చేస్తారట. ఓ హానెస్ట్ పొలిటీషియన్ అయిన తన తండ్రి మరణానికి ప్రతీకారంగా కలెక్టర్ పాత్ర ఏం చేస్తుంది అనేది మిగతా కథ అని అంతా సులువుగా ఊహిస్తారు. కానీ శంకర్ అందుకు భిన్నంగా ఇప్పటి వరకూ ఎవరూ చూపించని కోణంలో ఈ రెండో పాత్రను డిజైన్ చేశాడట. వ్యవస్థను చేతుల్లోకి తీసుకోవడం కంటే వ్యవస్థనే బలంగా చేసుకుని పోరాడితే సామాన్యుడు కూడా విజయం సాధిస్తాడు అనే యాంగిల్ ఉంటుందీ అంటున్నారు.

అయితే చరణ్ చేస్తోన్న పొలిటీషియన్ పాత్ర మాత్రం చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారట. మరి ఈ పాత్రలో చరణ్‌ ఎలా ఫిట్ అవుతాడు అనే సందేహాలున్నాయి. ఎందుకంటే పొలిటీషియన్ గా చరణ్‌ ను ఊహించడం కూడా కష్టం. అందుకు అతను ఇప్పటి వరకూ చేసిన సినిమాలతో పాటు.. వ్యక్తిత్వం కూడా కారణంగా కనిపిస్తుంది. ఏదేమైనా పొలిటీషియన్ రోల్ అంటే అనుకున్నంత సులువు కాదు. అలాగని కష్టమూ కాదు. కష్టం కాకుండా ఉండాలంటే ఆ పాత్రను చేస్తోన్న నటుడు కంటే చేయిస్తోన్న దర్శకుడికి ఎక్కువ క్లారిటీ ఉండాలి. ఈ విషయంలో శంకర్ ఎప్పుడూ బెస్టే అనిపించుకుంటాడు కాబట్టి.. పెద్ద కష్టమేం ఉండకపోవచ్చు..

Related Posts