సంక్రాంతికి ప్రభాస్ కు పోటీ ఎవరో తెలుసా..?

ఈ సారి సంక్రాంతి ఓ రేంజ్ లో ఉంటుందనుకున్న సినీ అభిమానులకు వాయిదాల పర్వం షాక్ ఇచ్చింది. లేదంటే సర్కారువారి పాట, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, బంగార్రాజు అంటూ భారీ ప్లానింగే ఉంది. కానీ ఆర్ఆర్ఆర్ ఎంట్రీతో అన్నీ సైడ్ అయిపోయాయి. కేవలం ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మాత్రమే బరిలో ఉన్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ పండగకు వారం ముందుగానే వస్తోంది కాబట్టి.. సంక్రాంతికి మరీ అంత క్రేజ్ ఉంటుందనుకోలేం. ఇక రాధేశ్యామ్ పై ఇంకా అంచనాలు పెరగాల్సి ఉంది. అలాగని అంత సులవుగా తీసేయలేం. ఒకవేళ సినిమా అల్టిమేట్ అయినా.. ఒకే సినిమాను చూడలేరు కదా.. అందుకే ప్రభాస్ పోటీగా దిల్ రాజు, సితార బ్యానర్ రంగంలోకి దిగుతున్నాయి.
సంక్రాంతి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది దిల్ రాజే కాబట్టి.. పెద్ద సినిమాలను పక్కన బెట్టాడు. కానీ తన సోదరుడి కొడుకు హీరోగా పరిచయం అవుతోన్న ‘రౌడీబాయ్స్’చిత్రాన్ని మాత్రం సంక్రాంతి బరిలో నిలుపుతున్నాడు. యస్.. రౌడీబాయ్స్ తో తమ్ముడి కొడుకును గ్రాండ్ రిలీజ్ తో పరిచయం చేస్తున్నాడు రాజు. మరి ఇతర సినిమాలను పక్కన బెట్టిన ఆయనకు ఈ విషయంలో ఎందుకు లైట్ తీసుకున్నాడంటే.. ఇది చాలా చిన్న సినిమా కాబట్టి అంటారు. కానీ నైతికంగా మాత్రం రాంగ్. అయినా సినిమావాళ్లకు నైతికత ఏంటీ అంటారా.. ఆల్ రైట్.
ఇక సంక్రాంతి బరి నుంచి తమ భారీ చిత్రం భీమ్లా నాయక్ ను సైడ్ చేసిన దిల్ రాజుపై చిన్న సినిమాతోనే రివెంజ్ తీర్చుకునేందుకు సితార బ్యానర్ కూడా సై అంటోంది. ఈ బ్యానర్ లో రూపొందిన చిత్రం ‘డిజే టిల్లు’. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా ప్రిన్స్ సీసిల్, బ్రహ్మాజీ, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని సంక్రాంతి బరిలో విడుదల చేయబోతున్నారు. ఓ రకంగా ఇది రౌడీబాయ్స్ కు కాంపిటీషన్ ఇస్తుందనుకోవచ్చు. ఆల్రెడీ ఈ బ్యానర్ నుంచి భీమ్లా నాయక్ ను దిల్ రాజు సైడ్ చేశాడు కాబట్టి.. మళ్లీ ఈ చిత్రం విషయంలో మాట్లాడకపోవచ్చు.
ఇక మూడో చిత్రంగా ముందు నుంచీ చెబుతోన్న బంగార్రాజు ఉండనే ఉంది. వీళ్లు మొదటి నుంచీ జనవరి 15న విడుదల చేస్తున్నాం అని చెబుతూ వస్తున్నాడు. చెప్పినట్టుగానే ఆ డేట్ లో వస్తారని టాక్ ఉంది. పైగా సినిమా కూడా బాగా వచ్చిందనే వార్తలు పరిశ్రమలో వినిపిస్తున్నాయి. అందుకే నమ్మకంగా రావాలనే అనుకుంటున్నారట అక్కినేని సోగ్గాళ్లిద్దరూ.
మొత్తంగా రాధేశ్యామ్ కు తోడుగా ఈ మూడు చిత్రాలూ ఉంటాయి. మరి వీటిలో రౌడీబాయ్స్, డిజే టిల్లు చిత్రాల ఖచ్చితమైన డేట్స్ ఇంకా అనౌన్స్ కావాల్సి ఉంది. అదన్నమాట.

Related Posts