ఎన్నో ప్రత్యేక హంగులతో చిరంజీవి ‘విశ్వంభర‘

గత ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య‘తో ఘన విజయాన్ని సాధించిన మెగాస్టార్ చిరంజీవికి.. ద్వితియార్థంలో వచ్చిన ‘భోళా శంకర్‘ భారీ డిజాస్టర్ ను మిగిల్చింది. ఈనేపథ్యంలో.. మెగాస్టార్ తన ఫుల్ కాన్సెంట్రేషన్ ‘విశ్వంభర‘ చిత్రంపైనే పెట్టాడు. ఈ సినిమాని సమ్ థింగ్ స్పెషల్ గా తీర్చిదిద్దించేందుకు ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడట చిరు.

‘విశ్వంభర‘ సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి‘ తర్వాత చిరంజీవి నటిస్తున్న అలాంటి జానర్ మూవీ ఇది. ఈ చిత్రంలో ఏకంగా పదమూడుకు పైగా పెద్ద సెట్స్ నిర్మాణం జరుగుతుందట. అలాగే.. వివిధ లోకాలకు సంబంధించిన కథ కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ మూవీ బడ్జెట్ లో మేజర్ పార్ట్ సెట్స్, వి.ఎఫ్.ఎక్స్ కే అవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకూ చిరంజీవి ఎంటరవ్వకుండానే ‘విశ్వంభర‘ షూట్ జరిగింది. ఫిబ్రవరి నుంచి మెగాస్టార్ ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. యు.వి.క్రియేషన్స్ ఎంతో ప్రెస్టేజియస్ గా ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమాని అంతే రిచ్ గా తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ వశిష్ట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర‘ ఇప్పటికే రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకుంది.

Related Posts