జనసేన పార్టీలో చేరిన నిర్మాత కాయగూరల లక్ష్మీపతి

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, జానీ మాస్టర్ వంటి వారు జనసేన పార్టీలో చేరారు. తాజాగా నిర్మాత, బిజినెస్ మాన్ కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీలో చేరారు. కే ఎల్ పి మూవీస్ సంస్థను స్థాపించి ‘IQ‘ వంటి సినిమాని నిర్మించారు కాయగూరల లక్ష్మీపతి. ఈయన తండ్రి కీ.శే. శ్రీ కె. నారాయణస్వామి గారు టిడిపి పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ మనుగడకై, ప్రజాసేవకై కృషి చేసిన వ్యక్తి. తన తండ్రి గారి స్ఫూర్తితో ఈయన కూడా ప్రజాసేవ చేయడానికి నేడు జనసేన పార్టీలో చేరారు.

గతంలో కాయగూరల లక్ష్మీపతి ఆర్టిఏ బోర్డు మెంబర్ గా, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ గా అనంతపురం పట్టణ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు సేవ చేసిన వ్యక్తి. అనంతపురం లో ప్రభుత్వ స్థలము నందు శాశ్వత ఆర్ టి ఓ కార్యాలయమును నిర్మించుటకు కృషిచేసి నిర్మాణం పూర్తి చేశారు. టెలికం ఎస్ టి డి, ఐ ఎస్ డి కమిటీ మెంబర్ గా పని చేసిన కాలంలో పార్టీ కార్యకర్తలకు ఎస్.టి.డి బూతులు కేటాయించి బ్యాంకు రుణాలు ఇప్పించారు. కె ఎస్ ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సొంత ఖర్చులతో పేదలకు దుప్పట్లో చేతి కర్రలు పంచి నీళ్ల ట్యాంకు నిర్మాణం చేయించారు. అదేవిధంగా అఖిలభారత కాపు సమాఖ్య నందు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ కాపు, బలిజల సంఘాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి. నేడు ఈయనకు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి అనంతపురం అర్బన్ నియోజకవర్గం పార్టీ గెలుపు కోసం ప్రజాసేవ కోసం కృషి చేయాలని సూచించడం జరిగింది.

Related Posts