మళ్లీ రెండు భాగాలు అంటోన్న ప్రభాస్ ..

ఒక కథను ఒకే సినిమాలో చెప్పలేకపోతే మరో పార్ట్ గా మారుస్తున్నారు మేకర్స్. ఒకప్పుడు ఇలాంటివి లేవు. అవసరమైతే కథలో అనేక మార్పులు చేసైనా సరే ఒకే సినిమాగా రూపొందించేవారు. మన దగ్గర బాహుబలితో ఈ కొత్త ట్రెండ్ మొదలైంది. తర్వాత కెజీఎఫ్ కూడా రెండు భాగాలుగా వచ్చింది. ఖైదీ, విక్రమ్ డిఫరెంట్ జానర్స్ లో వెళుతున్నాయి. అయితే పెద్ద హీరోలతో చేసే చిత్రాల విషయంలో ఈ రెండు భాగాలు అవసరమైతే నిర్మాతలు కూడా వెనకాడటం లేదు. అందుకే ప్రభాస్ చిత్రాన్ని కూడా టూ పార్ట్స్ అనేస్తున్నారు. ఆల్రెడీ గతంలో బాహుబలి కోసం ఐదేళ్ల టైమ్ ఇచ్చాడు ప్రభాస్. మరి ఈ సారి ఎంత టైమ్ తీసుకుంటాడో కానీ..ఈ టైటిల్ చూస్తేనే రెండు భాగాలు అవసరమే అనిపిస్తుంది.


బాహుబలితో వచ్చిన క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ ప్యాన్ ఇండియన్ హీరో అనే ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు ప్రభాస్. సాహోతో ఓ రేంజ్ యాక్షన్ చూపించిన అతను తర్వాత రాధేశ్యామ్ లో లవర్ పాత్రలో సెటిల్డ్ గా కనిపించాడు. ఒక్క యాక్షన్ సీన్ కూడా లేకుండా వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయినా.. ఓ మంచి ప్రేమకథగా మాత్రం ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మరిన్ని యాక్షన్ మూవీస్ తో రెడీ అవుతున్నాడు. అందులో ముందుగా వస్తోన్న చిత్రం ఆదిపురుష్‌. రామాయణ కావ్యం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కాబోతోంది.

ఈ మూవీ టీజర్ మెప్పించలేకపోవడంతో మరోసారి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ వర్క్స్ చేస్తున్నారు. కాస్త కఠినమే అయినా ఈ మూవీపై అంచనాలైతే లేవు. బట్ తర్వాత సెప్టెంబప్ 30న వచ్చే సలార్ పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈచిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. మళయాల టాప్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా ఉంటుందనే ప్రచారం ఉంది. కానీ కన్ఫార్మ్ చేయలేదు. సలార్ తర్వాత మారుతి డైరెక్షన్ లో చేస్తోన్న రాజా డీలక్స్ మూవీ ఉంటుంది. ఇది హారర్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అంటున్నారు.

మరి ఇంత భారీ ఇమేజ్ ఉన్న ప్రభాస్ కు ఈ జానర్ వర్కవుట్ అవుతుందా లేదా అనేది చూడాలి. అయితే హాలీవుడ్ రేంజ్ మేకింగ్ తో అక్కడి సూపర్ స్టార్స్ కు ఏ మాత్రం తీసిపోని స్టార్ గా ప్రభాస్ ను చూపిస్తూ రూపొందుతోన్న చిత్రం ప్రాజెక్ట్ కే. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు.

దీపికా పదుకోణ్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ మూవీనే రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు అని తెలుస్తోంది. కథ ఒకటే కానీ రెండు భాగాలుగా వస్తుందన్నమాట. అంటే బాహుబలిలా. కాకపోతే ఇలాంటి సినిమాలకు రెండో భాగానికి ఇచ్చే లింక్ కూడా బాహుబలి రేంజ్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేలా టాక్ ఆఫ్ ద కంట్రీలా ఉండాలి. ఏదేమైనా ప్రభాస్ మరోసారి రెండు భాగాల సినిమాతో వస్తున్నాడన్నమాట.

Related Posts