ఎన్టీఆర్ చెప్పాడని రామ్ చరణ్‌ సినిమా చూశాడు

స్నేహమేరా జీవితం అని సినిమాల్లో బాగా పాడతారు. అయితే సినిమా స్నేహాలు అంత గొప్పగా ఉండవు అనుకునేవారు ఒకప్పుడు. బట్ ఈ తరంలో అలా లేదు. స్టార్ హీరోలంతా ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. పార్టీస్ తో ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కనిపించిన గొప్ప స్నేహాల్లో ఎన్టీఆర్- రామ్ చరణ్ ది అని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ కంటే ముందే ఫ్రెండ్షిప్ ఉన్నా.. మూవీ టైమ్ లో అది స్ట్రాంగ్ అయింది. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అలా కొన్నాళ్ల క్రితం జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ గురించి అక్కడి బిబిసి ప్రతినిధి అడిగాడట. దానికి ఎన్టీఆర్ చెప్పిన మాటేంటో తెలుసా..?


హెవీ కాంపిటీషన్ ఉండే ఫీల్డ్ అంటే సినిమా పరిశ్రమనే చెప్పాలి. ఓవర్ నైట్ ఇమేజ్ లు మారిపోతుంటాయి. మారిన ఇమేజ్ అలాగే ఉంటుందీ అన్న గ్యారెంటీ కూడా ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు హార్డ్ వర్క్ చేస్తుండాలి. అందుకోసం ఇతరులను పొగడటం, వేరే వర్క్ ను మెచ్చుకోవడం అరుదుగా ఉంటుంది. బట్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అలా కాదు. ఒకరి ప్లస్ ల గురించి మరొకరు చెబుతూ.. చూసేవారిని ఆకట్టుకుంటూ ఉంటారు. అలా కొన్నాళ్ల క్రితం జపాన్ లో తమ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం వెళ్లారు. అక్కడ వీరి బాండ్ గురించి చాలా వార్తలు కూడా వచ్చాయి.

సినిమా హీరోలుగా కాక నిజంగా స్నేహితుల్లా ఉన్నారు వీళ్లు అని చెప్పుకున్నారు. అయితే జపాన్ బిబిసి ఎడిటర్ యూకో కాటో రీసెంట్ గా రామ్ చరణ్ రంగస్థలం సినిమాను చూశాడట. ఈ సినిమా గురించి, చరణ్ నటన గురించి ఓ రేంజ్ లో పొగుడుతూ ట్వీట్ చేశాడు. అదే టైమ్ లో ఈ సినిమా చూడమని చెప్పిన ఎన్టీఆర్ కు కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఎన్టీఆర్ చెప్పకపోతే ఇంత గొప్ప సినిమాను మిస్ అయ్యేవాడిని అనేది ఆ ట్వీట్ సారాంశం. విశేషం ఏంటంటే.. అదే వేదికలో రామ్ చరణ్‌ కూడా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేతలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ ఆ చిత్రాన్ని చూడాలని చెప్పాడు. దానికి ఇంకా స్పందన రాలేదు కానీ.. ఎన్టీఆర్ చెప్పిన రంగస్థలంపై బిబిసి రేంజ్ మీడియా ప్రతినిధి రియాక్ట్ కావడం విశేషమే.

Related Posts