‘కుబేర’ కోసం సరికొత్తగా కింగ్ నాగార్జున

కథ నచ్చితే చాలు కాంబినేషన్స్ గురించి అస్సలు పట్టించుకోడు కింగ్ నాగార్జున. ఈకోవలోనే.. పలు మల్టీస్టారర్స్ కి ఓ.కె. చెబుతుంటాడు. ఈ లిస్టులో నాగార్జున నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ధనుష్ టైటిల్ రోల్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా ‘కుబేర’ నుంచి నాగార్జున పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్.

నోట్ల కట్టలతో నిండిన కంటైనర్ల మధ్య వర్షంలో కళ్లద్దాలు పెట్టుకుని.. గొడుగుపట్టుకొని నడుచుకుంటూ వస్తోన్న నాగార్జునకు ఓ ఐదొందల నోటు వర్షపు నీటిలో తడిసిపోయి కనిపిస్తుంది. ఆ నోటును నాగ్ తీసుకుంటాడని అందరూ భావించినా.. తన జేబులోంచి ఓ ఐదొందల నోటు తీసి అక్కడికి కొద్ది దూరంలో ఉంచి ఆ తడిసిపోయిన నోటును రీప్లేస్ చేస్తాడు. ఈ గ్లింప్స్ తోనే ‘కుబేర’లో నాగార్జున పాత్ర ఎలాంటిదో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో నాగార్జున ఓ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోల్ క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Related Posts