‘హనుమాన్‘ నేపథ్యంతో మరో రెండు చిత్రాలు

‘కార్తికేయ 2‘తో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అందుకున్నాడు నిఖిల్. ఒకవిధంగా ప్రెజెంట్ దేశవ్యాప్తంగా సాగుతోన్న డివోషనల్ ట్రెండ్ కి ‘కార్తికేయ 2‘ శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. భగవాన్ శ్రీకృష్ణుడి గొప్పదనం గురించి ఆవిష్కరించిన ‘కార్తికేయ 2‘తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నిఖిల్. ఆ తర్వాత ‘కాంతార‘ వంటి సినిమాలు ఇదే డివోషనల్ కంటెంట్ తో పాన్ ఇండియా హిట్స్ గా నిలిచాయి.

ప్రస్తుతం నేషనల్ వైడ్ ‘హనుమాన్‘ ట్రెండ్ అవుతువుతున్నాడు. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ‘హనుమాన్‘ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూస్తూనే ఉన్నాము. ఇక.. నిఖిల్ కూడా తన అప్ కమింగ్ మూవీ ‘స్వయంభూ‘లో హనుమాన్ భక్తుడిగానే కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

‘మా ‘స్వయంభూ‘ సినిమా షూటింగ్‌ నాన్‌ స్టాప్‌ గా జరుగుతోంది. ఈ సినిమాలో నేను హనుమాన్‌ భక్తుడి పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నా ఫేవరెట్‌ డైలాగ్‌ జై శ్రీరామ్‌. ప్రస్తుతం అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నాం. దసర