చిరంజీవి.. జూనియర్ ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన సందర్భం

ఈతరం నటుల్లో అన్ని తరహా పాత్రలు పోషించగల సత్తా ఉన్న ఏకైక నటుడు ఎన్టీఆర్. ఒక డైలాగ్ చెప్పాలన్నా.. డ్యాన్సులు వేయాలన్నా.. ఫైట్స్ చేయాలన్నా.. ప్రతీ అంశంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు తారక్. అందుకే.. జూనియర్ ను అన్ని విషయాల్లోనూ మ్యాచ్ చేయడం ఏ నటుడి తరం కాదు. ఈ విషయాన్ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒప్పుకున్నారట.

2006లో ఎన్టీఆర్ నటించిన ‘రాఖీ’ సినిమా విడుదలైంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో కె.ఎల్.నారాయణ ఈ సినిమాని నిర్మించారు. లేటెస్ట్ గా ‘రాఖీ’ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు కె.ఎల్.నారాయణ. ‘రాఖీ’ సినిమా విడుదలకు ముందు.. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవికి ప్రివ్యూ వేశారట. ఆ సందర్భంలో.. ‘రాఖీ’ చిత్రంలోని కోర్టు సీన్ లో ఎన్టీఆర్ చెప్పే భారీ డైలాగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారట చిరు. అలాంటి డైలాగ్ ను ఎన్టీఆర్ తప్ప ఎవరూ చెప్పలేరనే విధంగా ప్రసంశించారట. ప్రస్తుతం కె.ఎల్.నారాయణ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు.. రాజమౌళి-మహేష్ బాబు తో సినిమాకి సిద్ధమవుతున్నారు నిర్మాత కె.ఎల్.నారాయణ. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం.. ఇప్పుడు రాజమౌళి-మహేష్ బాబు తనతో సినిమా చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

Related Posts