‘సైంధవ్‘ ట్రైలర్.. కూతురు కోసం సైకో గా మారిన వెంకటేష్

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘సైంధవ్‘ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘హిట్‘ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా జనవరి 13న విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన ‘సైంధవ్‘ నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజయ్యింది.

పోయినేడాది బాక్సాఫీస్ వద్ద హిట్ మంత్ర గా మారిన ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తోనే ‘సైంధవ్‘ తెరకెక్కినట్టు ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ‘మా నాన్న సూపర్ హీరో..
నాన్న ఉంటే నాకు భయమేయదు.. నాన్న ఉంటే నాకు ఏమీ కాదు..‘ అంటూ తండ్రిపై అమితమైన ప్రేమను కురిపించే కూతురు.. అనారోగ్య బారిన పడుతోంది. 17 కోట్ల రూపాయలు ఉంటే కాని నయం కాని జబ్బది. దీంతో కూతురు కోసం సైకో అవతారమెత్తుతాడు వెంకటేష్.

అసలు సైకో ఎవరు? అతని గతం ఏంటి? వంటి విజువల్స్ తో ట్రైలర్ ఒక్కసారిగా యాక్షన్ మోడ్ లోకి మారిపోయింది. ఆర్య, నవజుద్దీన్ సిద్ధిఖీ వంటి భారీ తారాగణంతో ట్రైలర్ ఆద్యంతం హై వోల్టేజ్ యాక్షన్ ఫీల్ ను కలిగిస్తుంది. ఈ మూవీలో బేబీ సారా, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా, ముఖేష్ రుషి, జిషు సేన్ గుప్తా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నానీతో ‘శ్యామ్ సింగరాయ్‘ వంటి హిట్ మూవీని నిర్మించిన నిహారికా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. మొత్తంగా.. ట్రైలర్ తో అంచనాలను భారీ స్థాయిలో పెంచేసిన ‘సైంధవ్‘.. సంక్రాంతికి హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది

Related Posts