‘టైసన్ నాయుడు‘గా అదరగొడుతోన్న బెల్లంకొండ

హీరోల కుమారులే కాదు.. నిర్మాతల తనయులు కూడా టాలీవుడ్ లో దుమ్మురేపుతున్నారు. అలాంటి వారిలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకడు. తక్కువ సమయంలోనే తెలుగులో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు బెల్లంకొండ. ఆరడుగులకు పైగా హైట్ తో.. ఆన్ స్క్రీన్ పై డాన్స్, ఫైట్స్ లో దుమ్మురేపే బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు ఈరోజు (జనవరి).

శ్రీనివాస్ బర్త్ డే స్పెషల్ గా తన కొత్త సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ‘భీమ్లా నాయక్‘ ఫేమ్ సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న చిత్రానికి ‘టైసన్ నాయుడు‘ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తున్న ఈ గ్లింప్స్ ఆద్యంతం హై వోల్టేజ్ యాక్షన్ తో ఆకట్టుకుంటుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Related Posts