‘లియో’ లో రామ్ చరణ్

విజయ్ హీరోగా లోకేష్‌ కనకరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ‘లియో’ లో రామ్ చరణ్.. అంటూ కోలీవుడ్, టాలీవుడ్ లో ఒక్కసారిగా ఓ సెన్సేషనల్ న్యూస్ హల్చల్ చేస్తోంది. అందుకు కారణాలూ లేకపోలేదు. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌.. ఇళయదళపతి విజయ్, లోకేష్‌ కనకరాజ్ లతో కలిసి ఓ లంచ్ మీట్ లో కలిశాడట

. ఈ వార్త నిజమా కాదా అని ఈ ముగ్గురిలో ఎవరూ ఇప్పటి వరకూ ఒక్క ట్వీట్ కానీ.. ఇంకే సోషల్ ప్లాట్ ఫామ్ లో కానీ పోస్ట్ చేయలేదు. అయినా ఈ వార్త ఎలా వచ్చిందీ అనేదే అందరిలోనూ కనిపిస్తోన్న ఆశ్చర్యం.
నిజానికి ఈ వార్త కొత్తదేం కాదు. మూడు నాలుగు రోజులుగా లియో సినిమాలో రామ్ చరణ్ ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నాడు అంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి.

ఇప్పుడు ఆ రూమర్స్ కు బలం వచ్చేలా ఏకంగా ఈ ముగ్గురూ కలిసి లంచ్ చేశారు అంటున్నారు. అయితే లోకేష్‌ గత సినిమా విక్రమ్ క్లైమాక్స్ లో వచ్చిన సూర్య .. ఆ మూవీపై ఎంత ఇంపాక్ట్ చూపించాడో తెలుసు కదా..? అలాంటిదే ఇప్పుడు విజయ్ సినిమాలో రామ్ చరణ్‌ కూడా చేయబోతున్నాడు అంటున్నారు. దీంతో ఈ వార్తకు కాస్త బలం వచ్చిందనేది నిజం.

ఎందుకంటే లోకేష్‌ ఇప్పుడు సినీవర్స్ ను క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు లియోలో కనిపించే రామ్ చరణ్‌ పాత్ర ఇంకెప్పుడో ఏదో ఒక లోకేష్‌ కనకరాజ్ సినిమాలో హీరోగా కనిపిస్తే ఆశ్చర్యమేం ఉంది. మొత్తంగా ఇప్పుడు లియో లో రామ్ చరణ్‌ అనే వార్త మాత్రం వైరల్ గా మారింది.

Related Posts