సలార్ కు కేజీఎఫ్‌ తో పోలిక.. ప్లస్సా.. మైనస్సా ..

ఓ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మరో స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. అదే టైమ్ లో కొన్ని పోలికలు కూడా ఉంటాయి. ఆ పోలికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రెండో సినిమాకు ఏదో రకమైన సమస్య అయితే కనిపిస్తుంది.

ఇప్పుడు సలార్ విషయంలో అదే జరగుతోంది. ప్యాన్ ఇండియన్ డార్లింగ్ స్టార్ ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్ తో ప్యాన్ ఇండియన్ ఫేవరెట్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ తీసిన సలార్ టీజర్ 6వ తేదీన ఉదయమే రాబోతోంది. ఇప్పటికే టీజర్ గురించిన చర్చలు ఓ రేంజ్ లో నడుస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ చిత్రం నుంచి ఫోటోస్ తప్ప మరే వీడియో రాలేదు. అందుకే ఈ టీజర్ కోసం తెల్లవారు జాము నుంచే ఎదురు చూడ్డం మొదలుపెడతారు ప్రేక్షకులు, ఫ్యాన్స్. అయితే సౌత్ లో ప్రస్తుతం ఓ హాట్ డిస్కషన్ నడుస్తోంది. సలార్ కూడా కేజీఎఫ్‌ లా ఉంటుందా లేక దానికి మించి ఉంటుందా అని.. అయితే ఈ విషయంలో ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.


అసలు ఒక సినిమాను మరో సినిమాతో పోల్చి చూడటమే తప్పు. ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకంగానే ఉంటుంది. ఈ విషయంలో ఎవరికీ డౌట్స్ అక్కర్లేదు. డౌట్స్ వచ్చాయి అంటే అలా ఆలోచించే వారికి సినిమా గురించి ఏమీ తెలియదు అనుకోవడమే తప్ప ఏం చేయలేం. నిజానికి కేజీఎఫ్‌ ఏ అంచనాలూ లేకుండా వచ్చింది. ఇంకా చెబితే అప్పటికి ఆ దర్శకుడు, హీరో ఎవరు అనేది పక్క భాషల వారికి కూడా పెద్దగా తెలియదు. అలాంటిది వాళ్లు ఓవర్ నైట్ ఓ మ్యాజిక్ చేశారు. ఆ మ్యాజిక్ దేశవ్యాప్తంగా వర్కవుట్ అయింది. ఆ తర్వాతే దానికి ప్యాన్ ఇండియన్ సినిమా అనే కలర్ యాడ్ అయింది. పైగా అప్పటికి ఈ ట్రెండ్ కేవలం బాహుబలి, సాహో చిత్రాలకే ఉంది. ఆ తర్వాత వచ్చి ఆకట్టుకుంది. ఆ బజ్ సెకండ్ పార్ట్ కు నెక్ట్స్ లెవెల్ లో వర్కవుట్ అయింది. రెండో చాప్టర్ గొప్పగా లేకపోయినా.. ఫస్ట్ చాప్టర్ కు వచ్చిన క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్స్ కూడా వచ్చాయి.


ఇప్పుడు సలార్ పరిస్థితి అది కాదు. దర్శకుడు, హీరో ఆల్రెడీ ప్రూవ్డ్. ఇద్దరూ ప్యాన్ ఇండియన్ స్టార్స్. ఇంకా చెబితే ప్రభాస్.. ప్రశాంత్ నీల్ కంటే పెద్ద స్టార్. అస్సలు బాగాలేదు అన్న టాక్ తెచ్చుకున్న ఆదిపురుష్‌ కూడా 400 కోట్ల క్లబ్ లోకి వెళ్లిందంటే అది కేవలం ప్రభాస్ఉండటం వల్లే అనేది సత్యం. అలాంటి ఇద్దరు చేసిన సలార్ ను అసలు కేజీఎఫ్‌ తో కంపేర్ చేయడమే వృథా. ఇక కంటెంట్ పరంగానే ఏ సినిమాకైనా కలెక్షన్స్ వస్తాయి. ఒక్కోసారి వీక్ కెంటెంట్ ఉండి.. స్ట్రాంగ్ ఎలివేషన్స్ ఉన్నా పనైపోతుందని చాలా సినిమాలు నిరూపించాయి. హీరోలను ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ స్టైల్ వేరే అని ఆల్రెడీ తెలిసింది. ఇక చిన్న ఎలివేషన్ సీన్ ఉన్నా.. దాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లే కటౌట్ ప్రభాస్ ది. సో.. ఈ చిత్రాన్ని సలార్ గా మాత్రమే చూడాలి తప్ప.. కేజీఎఫ్‌ లా ఉందా..? కేజీఎఫ్‌ కంటే బావుందా..? కేజీఎఫ్‌ తో పోలిస్తే బాలేదా అనే పోలికలే అర్థ రహితం.

Related Posts