అల్లు అర్జున్ కు పవన్ కళ్యాణ్‌ కౌంటర్

టాలీవుడ్ లో టాప్ హీరోల లిస్ట్ లో అల్లు అర్జున్ పేరు ఖచ్చితంగా ఉంటుంది కదా..? బట్ ఈ విషయంలో అతను లేడు అని ఇన్ డైరెక్ట్ గా చెబుతూ పవన్ కళ్యాణ్‌ వేసిన కౌంటర్ టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతోంది. నిజానికి మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య ఓ చిన్న గ్యాప్ అయితే వచ్చిందని కొన్నాళ్ల క్రితం చెప్పుకున్నారు. అందుకు ఆజ్యం పోసింది అల్లు అర్జున్ ”చెప్పను బ్రదర్” అనే మాట. అప్పటి నుంచి అల్లు అర్జున్ తనదైన ఫ్యాన్ బేస్ తోనే వెళుతున్నాడు.

మెగా ఫ్యాన్స్ గా కాక ఏఏ ఆర్మీగా తన అభిమాన గణానికి పేరు మార్చాడు. ఇండస్ట్రీలో అల్లు లెగసీ అనే మాటను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా వరకూ సక్సెస్ అయ్యాడు కూడా. బట్ అతను ఈ రేంజ్ కు రావడానికి కారణం మెగా హీరోలు, మెగా ఫ్యాన్స్ అనేది కాదనలేని సత్యం.

అందుకే అప్పట్లో చెప్పను బ్రదర్ అనే మాట వాడినందుకు అతనిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో దాడి జరిగింది. అఫ్‌ కోర్స్ అల్లు ఫ్యాన్స్ ఆ కౌంటర్స్ కు తమదైన శైలిలో ఎన్ కౌంటర్స్ వేశారనుకోండి. ఇక ఇన్నాళ్ల తర్వాత ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. అదీ పవన్ కళ్యాణ్‌ వల్ల.

జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్‌ కళ్యాణ్‌ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. ఓ వైపు సినిమాలు.. మరో వైపు పాలిటిక్స్ అంటూ వెళుతున్నాడు. అయితే కొన్నాళ్లుగా సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేశాడు. ఈ క్రమంలో వరుస ప్రాజెక్ట్స్ కు కమిట్ అయ్యి ఉన్నాడు. వీటిలో సముద్రఖని దర్శకత్వంలో సాయితేజ్ తో కలిసి నటించిన ‘బ్రో’ మూవీ పవన్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది.

సుజీత్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘ఓ.జి’ రెండు షెడ్యూల్స్ పూర్తయిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక షెడ్యూల్ ఫినిష్ అయింది. దీంతో ఇక ఎన్నికల ముందు వరకూ ఈ చిత్రాలన్నీ పూర్తయ్యాకే ఇక రాజకీయ కదనరంగంలోకి దిగుతాడు అనుకున్నారు.

బట్ మళ్లీ సడెన్ గా అన్ని ప్రాజెక్ట్స్ ను ఆపేసి వారాహియాత్ర మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతను చేస్తోన్న వ్యాఖ్యలు యూత్ టార్గెట్ గా ఉంటున్నాయి. ఈ క్రమంలో అందరు హీరోల అభిమానులను దగ్గర చేసుకునేలా కూడా తన స్పీచ్ లో మాటలు జోడిస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్ గా ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లో తనకు టాప్ హీరోలైన మహేష్‌ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్‌, రవితేజ అంటే చాలా ఇష్టం. ఈ స్టార్స్ ఫ్యాన్స్ అంతా సినిమాల టైమ్ లో ఎవరికి వారుగా ఉన్నా.. ఎన్నికల టైమ్ లో మాత్రం తనకు సపోర్ట్ చేయాలి అన్నాడు. ఇంత వరకూ బానే ఉన్నా.. ఈ టాప్ స్టార్స్ లిస్ట్ లో అల్లు అర్జున్ పేరు లేకపోవడంతో అతని ఫ్యాన్స్ అంతా గుస్సా అవుతున్నారు. తమ అభిమాన హీరో పేరును కావాలనే వదిలేశాడు పవన్ కళ్యాణ్‌ అంటూ చెప్పుకుంటున్నారు.

ఇక అప్పట్లో అల్లు అర్జున్ అన్న చెప్పను బ్రదర్ అన్న మాటకు కావాలనే ఇలా కౌంటర్ వేశాడు అనుకుంటున్నారు. మరోవైపు ఎలాగూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తనకు సపోర్ట్ చేయరు.. సోషల్ మీడియాల్లో మెగా హీరోలను ఎక్కువగా ట్రోల్స్ చేసేది వాళ్లే అనేది కూడా పవన్ కళ్యాణ్‌ అభిప్రాయంగా ఫీలవుతున్నారు మరికొందరు. ఏదేమైనా చిరజీంవి, రామ్ చరణ్ పేర్లు కూడా చెప్పిన పవన్ కళ్యాణ్‌ అల్లు అర్జున్ పేరు చెప్పకపోవడం అనేది కావాలనే చేశాడు అంటున్నారు ఐకన్ స్టార్ ఫ్యాన్స్. మరి ఈ వ్యవహారంలో పుష్పరాజ్ ఆర్మీ ఎలాంటి కౌంటర్స్ వేస్తుందో చూడాలి.

Related Posts