రామ్ చరణ్‌ కు కూతురు

మెగా పవర్ స్టార రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కూతురు జన్మించింది. నిన్న సాయంత్రమే డెలివరీ కోసం అపోలోహాస్పిటల్ లో జాయిన్ అయింది ఉపాసన. 20వ తారీఖు తెల్లవారు జామున తనకు డెలివరీ అయింది. ఈ దంపతులకు ఆడపిల్ల పుట్టిందని అపోలో హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారు. ఉపాసన డెలివరీకి వెళ్లినదగ్గర్నుంచీ రామ్ చరణ్ తో పాటు మెగా స్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు అపోలోలోనే ఉన్నారు. మామూలుగా మెగాస్టా ఇంటి ఇప్పటి వరకూ మగబిడ్డ లేదు.
రామ్ చరణ్‌ కు ఖచ్చితంగా మగబిడ్డ పుడతాడనే చాలామంది భావించారు.

తద్వారా మెగా ఇంటికి మరో వారసుడు వస్తాడు అనుకున్నారు. బట్ తన కూతుళ్ల బాటలోనే రామ్ చరణ్ కు కూడా ఆడపిల్ల పుట్టడం విశేషం. అయినా ఆడపిల్లే కదా ఇంటికి లక్ష్మి. ఆ లక్ష్మితో అతి త్వరలోనే హాస్పిటల్ నుంచి ఇంటికి షిఫ్ట్ కాబోతున్నారు ఈ దంపతులు. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి ఉపాసన కొన్నాళ్ల పాటు తల్లితండ్రుల ఇంట్లోనే ఉంటుందంటున్నారు. లేదంటే చిరంజీవి ఇంట్లోనేఅయినా ఉంటుంది. ఏదేమైనా తొలిసారి పేరెంట్స్ గా మారిన చరణ్ – ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు చెబుతోంది తెలుగు 70ఎమ్ఎమ్.

Related Posts