‘గేమ్ ఛేంజర్‘లో మలయాళీ సూపర్ స్టార్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్‘. ఈ సినిమా కాస్టింగ్ విషయంపై ఇప్పటికే ఫుల్ క్లారిటీ ఉంది. ఈ మూవీలో చరణ్ కి జోడీగా కియారా అద్వానీ నటిస్తుంటే.. సీనియర్ చరణ్ కి అంజలి నాయికగా కనిపించబోతుంది. ఇతర కీలక పాత్రల్లో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్, సముద్రఖని, నాజర్, జయరామ్ వంటి వారు సందడి చేయబోతున్నారు.

లేటెస్ట్ గా ‘గేమ్ ఛేంజర్‘ కాస్టింగ్ లిస్ట్ లోకి మరో పెద్ద పేరు చేరబోతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనం. ఈ మూవీలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్యమంత్రి పాత్రలో కేమియోతో మురిపించనున్నాడట. నిడివి తక్కువే అయినా.. ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీలో మోహన్ లాల్ పోషించే ముఖ్యమంత్రి రోల్ సినిమాకి ఎంతో కీలకంగా ఉండబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవైపు రామ్ చరణ్, మరోవైపు శంకర్.. ఇద్దరికీ మోహన్ లాల్ తో ఇదే తొలి సినిమా. మొత్తంమీద.. మోహన్ లాల్ ఎడిషన్ తో ‘గేమ్ ఛేంజర్‘కి మరికొంత బలం చేకూరినట్టే

Related Posts