‘ధూత 2‘ అనౌన్స్ మెంట్ వస్తోంది

టాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ హీరోస్ లో వెబ్ సిరీస్ తోనూ దుమ్మురేపిన హీరో నాగచైతన్య. గత డిసెంబర్ లో అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ‘ధూత‘ సిరీస్ కు మంచి పేరొచ్చింది. నియో నాయిర్ స్టైల్ లో క్రైమ్ థ్రిల్లర్ గా విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో జర్నలిస్ట్ సాగర్ వర్మ పాత్రలో అదరగొట్టాడు చైతూ.

‘బంగార్రాజు‘ తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు అందుకున్న చైతన్య కి ‘ధూత‘ వెబ్ సిరీస్ మంచి రిలాక్సేషన్ ఇచ్చిందని చెప్పొచ్చు. అలాంటి ‘ధూత‘ సిరీస్ కి ఇప్పుడు సీక్వెల్ రూపొందబోతుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే సీక్వెల్ తెరకెక్కనుందట. రేపు (మార్చి 19) ‘ధూత 2‘కి సంబంధించి అనౌన్స్ మెంట్ వీడియో రానుందట. మరోవైపు నాగచైతన్య పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘తండేల్‘తో బిజీగా ఉన్నాడు

Related Posts