‘యమధీర’ ట్రైలర్ లాంచ్‌

శ్రీమందిరం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో వేదాల శ్రీనివాస్‌ నిర్మిస్తున్న మూవీ ‘యమధీర’. ఈ చిత్రానికి దర్శకుడు శంకర్‌. కన్నడ హీరో కోమల్‌కుమార్‌ మెయిన్‌లీడ్‌గా క్రికెటర్‌ శ్రీశాంత్‌ నెగిటివ్ రోల్‌ ప్లే చేసిన మూవీ ఇది. ఈ సినిమాలో నాగబాబు, ఆలీ, మధుసూధన్, సత్యప్రకాశ్ ఇతర కీలక పాత్రలు ప్లే చేసారు. గతంలో ఈ సినిమా టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్‌ కుమార్ లాంచ్ చేసారు. ఈ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అదే జోష్‌లో ఇప్పుడ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు, నిర్మాత డి. ఎస్. రావు గారు, పి. శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.కన్నడ సినిమాగా తీసి తెలుగులో వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో మన తెలుగువారు నాగబాబు గారు, మధుసూదన్ గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు నటించడం ఇది ఒక తెలుగు సినిమాలాగే అనిపిస్తోంది. యమధీర టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది. యమ గతంలో మన యమదొంగ, యమలీల, యమగోల వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి అదేవిధంగా ధీర మగధీర లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. కోమల్ కుమార్ కూడా పోలీస్ ఆఫీసర్ గా చాలా అద్భుతంగా నటించాడు. మొత్తం అంతా కూడా ఫారిన్ లొకేషన్స్ లో చాలా అద్భుతంగా చిత్రీకరించారు.


ఈ యమధీర ఫిలిం ఈవీఎం ట్యాంపరింగ్ పైన చిత్రీకరించాము. అజర్ బైజాన్ కంట్రీ లో ఎక్కువ శాతం షూట్ చేసాము. 100 సినిమాల్లో నటించిన కోమల్ కుమార్ గారు క్రికెటర్ శ్రీశాంత్ గారు ముఖ్య పాత్రలో నటించారు. అదేవిధంగా నాగబాబు గారు, అలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధుసూదన్ గారు నటించారు. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకి సినిమాను తీసుకురాబోతున్నాం. ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు నిర్మాత వేదాల శ్రీనివాసరావు గారు.మిగతా టెక్నిషియన్స్, అతిధులు చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ టీమ్‌ కి అభినందనులు తెలిపా

Related Posts