SSMB29 ప్రారంభోత్సవానికి హాలీవుడ్ దర్శక దిగ్గజాలు

హాలీవుడ్ అనగానే ముందుగా గుర్తొచ్చే దర్శక దిగ్గజాలు స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కేమరూన్. దశాబ్దాలుగా హాలీవుడ్ ని ఏలుతున్న ఈ లెజెండరీ డైరెక్టర్స్ ఎన్నో సంచలనాత్మక సినిమాలు రూపొందించారు. సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త ప్రపంచాలు ఆవిష్కరించారు. వరల్డ్ వైడ్ గా ఉన్న ఎంతోమంది దర్శకులకు వీరే ప్రేరణ. అలాంటి వారిలో దర్శకధీరుడు రాజమౌళి ఒకరు. హాలీవుడ్ లో ఈ దర్శకులు తీర్చిదిద్దిన సినిమాల ప్రేరణతోనే రాజమౌళి కూడా తన సినిమాల్లో భారీతనానికి పెద్ద పీట వేస్తుంటాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని వేరు వేరు సందర్భాల్లో స్పీల్ బర్గ్, జేమ్స్ కేమరూన్ ఇద్దరూ పొగిడారు.

ఒకవిధంగా స్పీల్ బర్గ్ రూపొందించిన ఇండియానా జోన్స్ సిరీస్ తరహాలోనే మహేష్ బాబు చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. తన సినిమాలను ప్రారంభించే ముందే కథ మొత్తాన్ని పబ్లిక్ గా చెప్పడం జక్కన్నకి అలవాటు. ఇప్పుడు SSMB29 విషయంలోనూ అదే చేయబోతున్నాడట. ఈ సినిమా ప్రారంభోత్సవం రోజునే ఈ చిత్రం కథ వివరించడానికి సన్నాహాలు చేస్తున్నాడట.

స్టోరీ విషయాన్ని పక్కనపెడితే మహేష్ బాబు చిత్రం ఓపెనింగ్ మాత్రం భారీ స్థాయిలో నిర్వహించడానికి ప్లానింగ్ రెడీ చేస్తున్నాడట రాజమౌళి. ఆ ఓపెనింగ్ సెరమనీకి స్పీల్ బర్గ్, జేమ్స్ కేమరూన్ లను ముఖ్య అతిథులుగా పిలవడానికి ప్రణాళిక చేస్తున్నాడట. గతంలో శంకర్ తెరకెక్కించిన ‘ఐ’ సినిమాకోసం హాలీవుడ్ వెటరన్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ వచ్చాడు. అప్పట్లో అదో సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు రాజమౌళి-మహేష్ బాబు సినిమా ప్రారంభోత్సవానికి ఈ హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ వస్తే.. పాన్ వరల్డ్ రేంజులో ఇదో సెన్సేషనల్ న్యూస్ అవుతుంది.

Related Posts