రుద్రనేత్ర – చంటబ్బాయి ఇన్‌స్పిరేషన్‌తో వెన్నెల కిశోర్‌ చారి 111

స్టార్‌ కమెడియన్ వెన్నెల కిశోర్‌ హీరోగా రాబోతున్న మూవీ చారి 111. సంయుక్తా విశ్వనాధన్‌ ఫిమేల్‌ లీడ్ చేస్తోంది. బర్కత్‌ సోని బ్యానర్‌లో అదితి సోని ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి టీజీ కీర్తికుమార్‌ డైరెక్ట్ చేసారు. మార్చి 1 న రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా మీడియా పాత్రికేయల సమావేశంలో డైరెక్టర్ టీజి కీర్తికుమార్‌ సినిమా విశేషాలు పంచుకున్నారు.

మళ్లీ మొదలైంది సినిమాకు ముందు ఎడిటర్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసాననీ.. విజువల్‌ కమ్యూనికేషన్స్‌ పూర్తయ్యాక టీవి కమర్షియల్స్, కార్పొరేట్‌ ఫిల్మ్స్‌ ఎడిటింగ్ చేసానని చెప్పుకొచ్చారు టీజి కీర్తికుమార్. కొన్ని యాడ్ ఫిల్మ్స్‌ డైరెక్షన్‌ కూడా చేసారట. అదే ఎక్స్‌పీరియెన్స్‌తో తొలిసినిమా ‘మళ్లీ మొదలైంది‘ డైరెక్ట్ చేసాను అన్నారు టీజీ కీర్తికుమార్.

మళ్లీ మొదలైంది లో వెన్నెల కిశోర్‌ మంచి రోల్ చేసారు. అప్పుడే చారి 111 మూవీ చెప్పారట. వెన్నెల కిశోర్‌ కు నచ్చడంతో.. స్క్రిప్ట్‌ పంపిస్తే చదివి ఓకే చేసారట.నేను వెన్నెలకిశోర్‌ ఫ్యాన్‌ని . జానీ ఇంగ్లీష్‌ సినిమా చూసాక వెన్నెల కిశోర్‌తో అలాంటి సినిమా చేయాలనుకున్నారట. ‘చారి 111‘కు ఇన్స్పిరేషన్ ‘పింక్ పాంథర్’, ‘జానీ ఇంగ్లీష్’ వంటి హాలీవుడ్ ఫిలిమ్స్. నాకు అటువంటి సినిమాలు ఇష్టం అన్నారు.స్పై యాక్షన్ కామెడీ ఫిల్మ్. ‘ జేమ్స్ బాండ్’ చూస్తే స్పై యాక్షన్. ‘జానీ ఇంగ్లీష్’ చూస్తే… స్పై యాక్షన్ కామెడీ. నాది రెండో కేటగిరీ సినిమా అన్నారు.