హాలీవుడ్ అనగానే ముందుగా గుర్తొచ్చే దర్శక దిగ్గజాలు స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కేమరూన్. దశాబ్దాలుగా హాలీవుడ్ ని ఏలుతున్న ఈ లెజెండరీ డైరెక్టర్స్ ఎన్నో సంచలనాత్మక సినిమాలు రూపొందించారు. సిల్వర్ స్క్రీన్ పై

Read More

జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి ‘అవతార్’. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌ గా ‘అవతార్-‌2- ది వే ఆఫ్‌ వాటర్’ రూపొందించారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం జేమ్స్‌ కామెరూన్‌ అండ్ టీం సంవత్సరాల కాలం పాటు పనిచేసి మరోసారి అద్భుతమైన, హై-ఎండ్ స్టీరియోస్కోపీని అందించనున్నారు. ‘అవతార్ 2’ ప్రపంచ సినీ చరిత్రలో నాల్గవ అత్యంత ఖరీదైన చిత్రం. గత అవతార్‌ రికార్డులని బ్రేక్ చేసి అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా ‘అవతార్ 2’ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని భావిస్తున్నారు. అనేక ఇతర భాషలతో పాటు, అవతార్ 2 తెలుగు వెర్షన్ కూడా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఆసక్తికరమైన అప్‌ డేట్ ఏమిటంటే.. తెలుగు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కూడా ఈ అద్భుత చిత్రం కోసం పని చేశారు. ‘అవతార్-‌2- ది వే ఆఫ్‌ వాటర్’ తెలుగు వెర్షన్‌ కి డైలాగ్స్ రాశారు శ్రీనివాస్ అవసరాల. రచయిత- దర్శకుడైన శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రైటింగ్ విలక్షణంగా వుంటుంది. అవతార్ 2 తన మార్క్ డైలాగులతో తెలుగు ప్రేక్షకులకు మరింత ప్రత్యేకం కానుంది. ‘అవతార్-‌2- ది వే ఆఫ్‌ వాటర్’ విజువల్ గ్రాండియర్‌ను తెరపై చూడాలంటే మరో నాలుగు రోజులు ఆగాలి.

Read More

అద్భుతం.. ఈ మాట సులువుగా అనేస్తుంటాం కానీ.. అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ అనుభూతిని పొందగలుగుతాం. ముఖ్యంగా సినిమాల విషయంలో ఈ ఫీలింగ్ చాలా అరుదుగా వస్తుంది. అలా వచ్చినప్పుడు దాని అనుభూతి అంత

Read More