‘పుష్ప’కి జాతర సీక్వెన్స్.. ‘దేవర’కు ఆయుధపూజ పాట

గతంలో మన కథానాయకులు ఇంచుమించు ఒకే తరహా మేకోవర్ తో కనిపించేవారు. కానీ.. ఇప్పుడు వారి ఆహార్యం దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. సినిమా సినిమాకీ తమను తాము ఆ పాత్రలోకి ఒదిగిపోయేలా మలచుకుంటున్నారు. ఈ లిస్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ముందు వరుసలో నిలుస్తాడు. ‘ఆర్.ఆర్.ఆర్‘తో గ్లోబల్ స్టార్ గా అవతరించిన తారక్.. ఆ ఇమేజ్ ను మరింత పెంచుకునేలా ‘దేవర‘తో సిద్ధమవుతున్నాడు.

ఇప్పటివరకూ కనిపించనటువంటి నెవర్ బిఫోర్ లుక్ తో ‘దేవర‘లో మురిపించడానికి ముస్తాబవుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసే హై వోల్టేజ్ యాక్షన్ అయితే మామూలుగా ఉండదట. ఈ చిత్రానికి సంబంధించి మేజర్ యాక్షన్ పార్ట్ చిత్రీకరణ పూర్తైంది. ఇక.. మిగిలింది క్లైమాక్స్ ఒక్కటే. ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ షూట్ కంప్లీట్ కావాల్సి ఉంది. కానీ.. ఆమధ్య సైఫ్ ఆలీ ఖాన్ గాయపడడంతో వాయిదా పడింది. మార్చి రెండో వారం నుంచి ‘దేవర‘ క్లైమాక్స్ చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్, సైఫ్ ఆలీ ఖాన్ మధ్య ఈ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారు.

‘దేవర’లో యాక్షన్ పార్ట్ మాత్రమే కాదు.. పాటలు కూడా అంతే అద్భుతంగా ఉండబోతున్నాయట. ముఖ్యంగా.. ఈ మూవీలో ఓ ఆయుధపూజ సాంగ్ అయితే హైలైట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ ఇప్పటికే ఆయుధపూజ పాటకు ట్యూన్ రెడీ చేశాడట. త్వరలోనే ఆ పాట చిత్రీకరణ సాగనుందట. మొత్తానికి ‘పుష్ప 2‘లో జాతర సీక్వెన్స్ కు సంబంధించి ఎలాంటి హడావుడి జరుగుతుంతో తెలిసిందే. ఇప్పుడు ‘దేవర 1‘లో ఆయుధపూజ పాట కూడా అంతకుమించి అన్నట్టు తెరకెక్కించనున్నారట.

Related Posts