మైసూర్ లో ‘గేమ్ ఛేంజర్’ న్యూ షెడ్యూల్

ఒకవైపు ‘ఇండియన్ 2’తో బిజీగా ఉంటూనే మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ చిత్రీకరణను పూర్తిచేస్తున్నాడు శంకర్. ఇటీవల ‘ఇండియన్ 2’ కోసం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, వైజాగ్ లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ షురూ కాబోతుంది. నవంబర్ 23 నుంచి మైసూర్ లో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన పొలిటికల్ సీన్స్ చిత్రీకరించనున్నాడట శంకర్. డిసెంబర్ 2 వరకూ ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్టు తెలుస్తోంది.

కార్తీక్ సుబ్బరాజ్ కథ సమకూర్చిన ఈ సినిమాని తనదైన స్టైల్ లో ఎంతో భారీతనంతో పొలిటికల్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దుతున్నాడట శంకర్. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ లో ప్రతిష్ఠాత్మక 50వ చిత్రంగా ‘గేమ్ ఛేంజర్’ని తీసుకొస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది.

తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ దీపావళి కానుకగా విడుదలవ్వాల్సి ఉంది. అయితే.. మ్యూజిక్ సంస్థల మధ్య ఒప్పందాల విషయం కొలిక్కి రాకపోవడంతో పాట రాలేదు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు డేట్ అనౌన్స్ చేయనున్నారట. మొత్తంమీద.. వచ్చే జనవరి, ఫిబ్రవరి వరకూ ‘గేమ్ ఛేంజర్’ను పూర్తిచేసి.. మార్చి నుంచి బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమాని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడు మెగాపవర్ స్టార్.

Related Posts