‘పుష్ప 2’ సాంగ్.. ఈసారి అస్సలు తగ్గేదే లే!

‘పుష్ప’ ఫ్రాంఛైజ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వాగ్ అయితే.. ఆ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది పాటల గురించి. అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ అంటేనే పాటలు సూపర్ హిట్. ఇక.. అంతకుముందు వరకూ తెలుగుకే పరిమితమైన వీరి కాంబో ‘పుష్ప’తో పాన్ ఇండియా బాట పట్టింది. పాన్ ఇండియా లెవెల్ లో ‘పుష్ప’ పార్ట్ 1 లోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ‘పుష్ప 1’ ఆల్బమ్ సూపర్ హిట్ ఇవ్వడంతో.. ‘పుష్ప 2’ ఆల్బమ్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. లేటెస్ట్ గా ‘పుష్ప 2’ మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుట్టింది చిత్రబృందం. ఈరోజు ‘పుష్ప 2’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘పుష్ప పుష్ప’ రిలీజ్ అయ్యింది.

‘పుష్ప పుష్ప’ అంటూ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ హై ఎనర్జిటిక్ సాంగ్ ను.. ‘నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే’ అంటూ పుష్ప రాజ్ పాత్రను ఎలివేట్ చేస్తూ ఆస్కార్ విజేత చంద్రబోస్ రాశాడు. ఇక.. నకాష్ అజీజ్, దీపక్ బ్లూ సంయుక్తంగా ఆలపించిన ఈ గీతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వాగ్ అయితే మామూలుగా లేదు. ఈ లిరికల్ సాంగ్ లో పుష్ప రాజ్ హుక్ స్టెప్స్ సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పాలి. అలాగే.. పాట చివరిలో గాజు గ్లాసుతో బన్నీ వేసే స్టెప్పులు మెస్మరైజింగ్ గా ఉన్నాయి. మొత్తంమీద.. ఫస్ట్ సింగిల్ తో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది ‘పుష్ప 2’ టీమ్. ఆగస్టు 15న ‘పుష్ప 2’ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts