మన్సూర్ పై ఫైర్ అయిన మెగాస్టార్

హీరోయిన్ త్రిష పై.. తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ‘లియో‘ సినిమాలో త్రిష హీరోయిన్ కాగా.. మన్సూర్ ఆలీ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ‘తాను గతంలో చాలా రేప్ సీన్స్ లో నటించానని.. ‘లియో‘ మూవీలో కూడా త్రిషతో తనకు ఓ రేప్ సీన్ ఉంటే బాగుండేదని.. కశ్మీర్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు త్రిషను కనీసం తనకు చూపించలేదని ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు మన్సూర్. ఈ విషయంపై త్రిష చాలా ఘాటుగా స్పందించింది. ఇకపై మన్సూర్ ఆలీ ఖాన్ తో నటించనని తేల్చి చెప్పింది.

త్రిషకు మద్దతుగా ‘లియో‘ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా గళం విప్పాడు. ఇంకా.. తమిళం నుంచి చాలామంది సెలబ్రిటీలు ఈ విషయంలో త్రిషకు మద్దతుగా నిలిచారు. తెలుగు నుంచి ఇప్పటికే నితిన్ త్రిషకు మద్దతుగా పలకగా..

లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై స్పందించారు. ‘త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని.. ఆ వ్యాఖ్యలు నటులకే మాత్రమే కాదు.. ఏ స్త్రీ, ఏ అమ్మాయిపైనా ఇలాంటి వ్యాఖ్యలను చేయడం సహించకూడదని తెలిపారు. తాను మన్సూర్ ఆలీఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. ఈ విషయంలో త్రిషకు మద్దతిస్తున్నట్టు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు మెగాస్టార్.

Related Posts