నాగవంశీ మాటలు నిజమయ్యేనా?

రాబోయే సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలున్నా.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’పై ఉండే అంచనాలు వేరు. మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రం గురించి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ‘గుంటూరు కారం’ నుంచి రిలీజైన హై ఇన్ఫ్లేమబుల్ మాస్ స్ట్రైక్ టీజర్ కి.. ‘దమ్ మసాలా’ సాంగ్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ మేకోవర్, మాస్ అప్పీరెన్స్ అదరగొట్టబోతున్నాయనే హింట్స్ వచ్చేశాయి.

producer-nagavamshi-about-guntur-kaaram-songs

సంక్రాంతి కానుకగా రాబోతున్న ‘గుంటూరు కారం’ ప్రచారంలో ఇకపై స్పీడు పెంచబోతుంది టీమ్. లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే వారం ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. ఇక గతంలో త్రివిక్రమ్, తమన్, హారిక అండ్ హాసిని నుంచి వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ పాటలు ఎవర్ గ్రీన్ మ్యూజికల్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

ఇప్పుడు ‘గుంటూరు కారం’ పాటలు కూడా ఏడాది మొత్తం పాడుకునే విధంగా ఉంటాయని హామీ ఇస్తున్నారు నిర్మాత నాగవంశీ. మరి.. ‘గుంటూరు కారం’ పాటల విషయంలో నాగవంశీ మాటలు నిజమవ్వాలని ఆశిద్దాం. జనవరి 12న ‘గుంటూరు కారం’ విడుదలకానుంది.

Related Posts