యానిమేషన్ రూపంలో ‘బాహుబలి.. క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’

దర్శకధీరుడు రాజమౌళి సృష్టి ‘బాహుబలి’ సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ లో వచ్చిన ‘బాహుబలి 1, 2’ రెండు భాగాలూ దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో చోటు సంపాదించుకున్నాయి. ‘బాహుబలి’ సిరీస్ లో మరో భాగం వస్తే చూడాలని ప్రేక్షకులు ఎంతగానో కోరుకున్నారు. అయితే.. అది ఇప్పట్లో నెరవేరకపోయినా ‘బాహుబలి’ పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ రాబోతుంది.

‘బాహుబలి.. క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ టైటిల్ తో రానున్న ఈ సిరీస్ ట్రైలర్ త్వరలోనే విడుదలకానుందట. ఆ విషయాన్ని ‘ఎక్స్’లో పంచుకుంటూ ‘బాహుబలి.. క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ మూవీ మోషన్ టీజర్ ను రిలీజ్ చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ‘మాహిష్మతి ప్రజలు అతని పేరు జపించినప్పుడు విశ్వంలోని ఏ శక్తి అతన్ని తిరిగి రాకుండా ఆపలేదు’ అని తన పోస్ట్ లో ‘బాహుబలి.. క్రౌన్ ఆఫ్ బ్లడ్’ గురించి పరిచయ వ్యాఖ్యాలు రాశాడు జక్కన్న. అసలు ‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ఏంటి? ఇది ‘బాహుబలి’ సిరీస్ కు కొనసాగింపుగా ఉంటుందా? లేదా? అనే విషయాలు మరికొన్ని రోజుల్లో తెలియనున్నాయి.

Related Posts