శేఖర్ కమ్ముల క్రేజీ మల్టీస్టారర్ ‘కుబేర’

టాలీవుడ్ లో ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల. హృద్యమైన కథలను అంతే హృద్యంగా వెండితెరపై ఆవిష్కరిస్తుంటాడు. ‘లవ్ స్టోరీ‘ తర్వాత శేఖర్ కమ్ముల.. నాగార్జున, ధనుష్ కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రధాన పాత్ర ధనుష్ ది. కింగ్ నాగార్జున ఎక్స్ టెండెడ్ కేమియోలో మురిపించబోతున్నాడు. హీరోయిన్ గా రష్మిక నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా టైటిల్ తో పాటు.. ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్.

ఈ క్రేజీ మల్టీస్టారర్ కి ‘కుబేర’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘కుబేర’ అంటే సంపదకు అధిపతి. అలాంటి టైటిల్ తో వస్తోన్న ఈ చిత్రంలో హీరో ధనుష్ ని చూస్తే మాత్రం బికారి గా కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ లో ధనుష్ మాసిపోయిన దుస్తులు, పెరిగిన గడ్డంతో ఓ బికారిని తలపించే రూపుతో కనిపిస్తున్నాడు. ఈసారి శేఖర్ కమ్ముల తన స్టైల్ కి విభిన్నంగా తీస్తున్న ఈ సినిమాలో ధనుష్ మేకోవర్ మెస్మరైజింగ్ గా ఉంది. ఈ సినిమాతో ధనుష్ మరోసారి జాతీయ అవార్డు అందుకుంటాడా? అనిపిస్తుంది.

ఈ చిత్రం నుంచి నాగార్జున లుక్ అయితే రిలీజ్ కాలేదు. పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో రాబోతున్న ఈ మూవీని శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహనరావు నిర్మిస్తున్నారు

Related Posts