ఆహా బోల్ట్ అటెంప్ట్.. రెండు జంటల ‘మిక్స్ అప్’ స్టోరీ

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత బోల్డ్ కంటెంట్ తో రూపొందే సినిమాలు, సిరీస్ లు బాగా పెరిగాయి. సెన్సార్ అడ్డంకులు లేకపోవడంతో కొత్త పాయింట్స్ తో బోల్డ్ అటెంప్ట్స్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇక.. ఈ విషయంలో బాలీవుడ్ చాలా ముందుండగా.. ఇప్పుడు తెలుగులోనూ ఇలాంటి ప్రయత్నాలు పెరుగుతున్నాయి. ఈకోవలోనే ఆహా ఓటీటీలో రాబోతుంది ‘మిక్స్ అప్’ మూవీ.

మార్చి 15 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కాబోతున్న ‘మిక్స్ అప్’ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది. కమల్ కామరాజు, ఆదర్శ్ బాలకృష్ణ, పూజా జవేరి, అక్షర గౌడ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీకి ఆకాశ్ బిక్కి దర్శకుడు. పెళ్ళైన రెండు జంటల మధ్య ‘మిక్స్ అప్’ కథ సాగుతుందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఒక జంటలోని భార్యకి, మరో జంటలోని భర్తకి సుఖవంతమైన జీవితంపై ఎక్కువ ఆసక్తి ఉండడం.. మిగిలిన ఇద్దరికి లవ్ మేకింగ్ పై ఆసక్తి ఉండడం ట్రైలర్ లో చూపించారు. ఆ నలుగురిలో ఒకే రకమైన ఆసక్తితో ఉన్న ఇద్దరు మరో ఇద్దర్ని కలుసుకుంటే… ఆ తరువాత ఏం జరిగిందనేది ‘మిక్స్ అప్’ మూవీ కథగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఈ ట్రైలర్ ఆద్యంతం లస్ట్ మేకింగ్ సీన్స్ తో నిండిపోయింది. ఇంతకుముందు తెలుగులో చూడనవంటి డబుల్ డోస్ బోల్డ్ నెస్ తో ఈ వెబ్ మూవీ రాబోతున్నట్టు అర్థమవుతోంది

Related Posts