హాలీవుడ్ హీరోలను తలదన్నేలా మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి అందగాడు. హాలీవుడ్ హీరోలు కూడా అతని ముందు దిగదుడుపే. వయసు పెరుగుతోన్నా వన్నె తగ్గని అందంతో మెరిసిపోయే మహేష్ బాబు లేటెస్ట్ ఫోటో షూట్ అందరినీ ఆకట్టుకుంటుంది.

కూల్ గ్లాసెస్ పెట్టుకుని.. సూట్ వేసుకుని సూపర్ స్టార్ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ‘సూటెడ్ అప్’ అంటూ సూట్ లో దిగిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మహేష్.

మరోవైపు ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘అభిబస్’ యాడ్ షూట్ లో పాల్గొన్నాడు మహేష్. ఈ షూట్ లో మహేష్ తో పాటు నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..

‘బ్యాక్ విత్ బాబు.. ఈసారి యాడ్ షూట్ కోసం’ అంటూ వివరాలను బయటపెట్టాడు అనిల్ రావిపూడి. మొత్తంమీద.. మహేష్ న్యూ లుక్ అయితే హాలీవుడ్ హీరోలను తలదన్నేలా ఉంది. త్వరలో ఎలాగూ రాజమౌళి చిత్రంతో అదే పనిచేయబోతున్నాడు టాలీవుడ్ ప్రిన్స్

Related Posts