HomeMoviesటాలీవుడ్2024 సమ్మర్.. మామూలుగా ఉండదు

2024 సమ్మర్.. మామూలుగా ఉండదు

-

వేసవి అంటే తెలుగు సినిమా పరిశ్రమకే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే పండగ లాంటి సీజన్. అందరికీ హాలిడేస్ ఉంటాయి. ఎండ వేడికి తట్టుకోలేక ఏసి థియేటర్స్ లో సేదతీరు బ్యాచ్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ బ్లాక్ బస్టర్ సినిమాలకు ఏసి ఉన్నా కిక్కిరిసిన జనాలతో ఉక్కపోత తప్పదు. 2023 సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక థియేటర్స్ అన్నీ వెలవెలబోయాయి. వచ్చిన సినిమాలు కూడా ఏవీ ఆకట్టుకోలేదు. దీంతో అటు బాక్సాఫీస్ కూడా కళ తప్పింది. బట్ 2024 సమ్మర్ అలా కాదు. వేసవిలో వచ్చే సినిమాల లైనప్ చూస్తే ఇప్పటి నుంచే హీట్ మొదలవుతుంది. వరుసగా టాప్ స్టార్స్ మూవీస్ అన్నీ లిస్ట్ అయ్యి ఉన్నాయి. మరి మార్చి నుంచి మొదలు కాబోతోన్న ఈ టాప్ స్టార్ మూవీస్ ఏంటీ.. ఏ డేట్స్ లో ఎవరి సినిమాలు వస్తున్నాయో చూద్దాం…


సమ్మర్ మూవీస్ కు ట్రైలర్ లాగా సంక్రాంతి కూడా ఫుల్ ప్యాక్ అయి ఉంది. అన్నీ ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాయి. ఈ సంక్రాంతి తర్వాత మార్చి నుంచి సినీ మహోత్సవం మొదలు కాబోతోందన్నమాట. ఆ ఉత్సవంలో మొదటగా వచ్చే సినిమా మన ఐకన్ స్టార్ నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న పుష్ప ది రూల్ ను మార్చి 22న విడుదల చేయబోతున్నారు. పుష్పరాజ్ దందాతో మొదలు కాబోతోన్న బాక్సాఫీస్ వేట మే వరకూ ఊపిరి పీల్చుకోనంత ఇదిగా ఉండబోతోంది. యస్.. పుష్ప విడుదలైన 14 రోజుల తర్వాత ఏప్రిల్ 5న దేవర వస్తున్నాడు.


ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తోన్న ఈ మూవీ సముద్రం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ నుంచి టాకీ స్టార్ట్ చేసి నవంబర్ లోగా మొత్తం షూటింగ్ ను ఫినిష్‌ చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ కోసం కాస్త ఎక్కువ టైమ్ తీసుకుని బెస్ట్‌ క్వాలిటీ అవుట్ పుట్ తోనే ఏప్రిల్ 5న రాబోతోంది దేవర సినిమా.


దేవర తర్వాత వారంలో రాబోతోన్న సినిమా కంగువ. తెలుగు సినిమా కాకపోయినా.. కంగువ హీరో సూర్యకు తెలుగులోనూ తిరుగులేని మార్కెట్ ఉంది. పైగా ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ తెలుగు మార్కెట్ ను కూడా షేక్ చేస్తుందంటున్నారు. కాకపోతే దేవరకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే .. కొంత ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుందేమో కానీ.. మూవీ లవర్స్ కు మాత్రం జాతరే.


ఈ మూడు సినిమాల తర్వాత వస్తున్నాడు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. యస్.. పవన్ కళ్యాణ్‌, సుజిత్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ ‘ఓజి’ని ఏప్రిల్ 26న విడుదల చేయబోతున్నారు. చాలామంది ఈ డిసెంబర్ లో అనుకున్నారు. మరికొందరు సంక్రాంతికి వస్తుందన్నారు. బట్ అవేవీ కాకుండా ఓ మంచి కంటెంట్ తో బెస్ట్ క్వాలిటీతో ఏప్రిల్ 26న ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా శ్రీయ రెడ్డి, ప్రకాష్‌ రాజ్, అర్జున్ దాస్, హరీష్‌ ఉత్తమన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.


ఇక మే నెలలో వస్తోంది అసలైన సునామీ. ఇప్పటికే బాక్సాఫీస్ బుల్డోజర్ అనిపించుకున్న డార్లింగ్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందిన కల్కి 2898 చిత్రం మే 9న విడుదల కాబోతోంది. ఈ యేడాది ఆరంభంలో సంక్రాంతి రిలీజ్ అన్నారు కానీ.. అది సాధ్యం కాదని తేలిపోయింది. ఆ మధ్య విడుదల చేసిన చిన్న టీజర్ తోనే చాలా పెద్ద ఇంపాక్ట్ వేశాడు నాగ్ అశ్విన్. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోణ్, దుల్కర్ సాల్మన్ వంటి భారీ తారాగణం ఉందీ సినిమాలో. ఎలా చూసినా ఇంటర్నేషనల్ లెవల్ లో ఈ మూవీ ఉంటుందని ముందు నుంచీ ఓ వైబ్ క్రియేట్ చేశారు మేకర్స్.

సో.. ఇప్పటి వరకూ సమ్మర్ లో రాబోతోన్న సునామీ లాంటి సినిమాల లిస్ట్ ఇది. వీటిలో డేట్స్ మారే సినిమాలు దాదాపుగా లేవు. ఇంకా కొత్తగా ఎవరైనా వచ్చినా.. వీరిని మించిన స్టార్స్ వస్తారు అని చెప్పలేం. సో.. 2024 సమ్మర్ ఆడియన్స్ అంతులేని వినోదాన్ని ఇవ్వబోతుందన్నమాట.

ఇవీ చదవండి

English News