HomeMoviesటాలీవుడ్దేవర.. క్వాలిటీకే 150 కోట్లు

దేవర.. క్వాలిటీకే 150 కోట్లు

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న సినిమా దేవర. ఈ మూవీ ఆరంభం నుంచి వార్తల్లోనే ఉంటోంది. అందుకోసం ప్రత్యేకంగా వాళ్లేం చేయడం లేదు. కానీ సినిమా గురించి వస్తోన్న అప్డేట్స్ మాత్రం అలాగే ఉంటున్నాయి. డైరెక్ట్ గా దర్శకుడో, నిర్మాతలో ఏ విషయమూ చెప్పడం లేదు. కానీ ఇతర టెక్నీషియన్స్ నుంచి అనూహ్యమైన అప్డేట్స్ వస్తున్నాయి.

అవి ఒక్కోటి ఒక్కో రేంజ్ లో అంచనాలు పెంచుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత పెరిగిన ఎన్టీఆర్ ఇమేజ్ కు అనుగుణంగా ప్యాన్ ఇండియన్ కంటెంట్ తో వస్తోన్న ఈ మూవీ కోసం హీరోయిన్ గా జాన్వీ కపూర్, విలన్ గా సైఫ్ అలీఖాన్ ను తీసుకున్నారు.

ఈ ఇద్దరూ బాలీవుడ్ మార్కెట్ లో పెద్ద ప్లస్ అవుతారని వేరే చెప్పక్కర్లేదు.
ఇక ఈ చిత్రంలో ఏకంగా 7 – 8 ఫైట్స్ ఉంటాయని సమాచారం. అంటే యాక్షన్ కు పెద్ద పీట వేశారు. వీటిలో మూడు ఫైట్స్ అండర్ వాటర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయనట. అంటే సినిమా సముద్ర తీర ప్రాంత నేపథ్యంలో సాగుతుంది కాబట్టి.. సముద్రంలో సాగే ఫైట్స్ హైలెట్ అనేలా ఉంటాయన్నమాట.

అయితే ఇవన్నీ హైదరాబాద్ లోనే సెట్స్ లో చిత్రీకరించారు. ఇప్పటికే యాక్షన్ పార్ట్ షూటింగ్ అయిపోయిందనే టాక్ కూడా ఉంది. ఈ పార్ట్స్ కోసం ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అవసరం అవుతాయి కదా.. వీటికే 150 కోట్లు ఖర్చు చేయబోతున్నారట. యస్.. కేవలం యాక్షన్ సీక్వెన్స్ కోసం అవసరమయ్యే గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ కోసమే 150 కోట్ల బడ్జెట్ కేటాయించారట. అంటే ది బెస్ట్ క్వాలిటీతో ఇవి నిజంగా సముద్రంలోనే జరిగినట్టుగా కనిపించబోతున్నాయి. ఇక మిగతా బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతోంది. ఈచిత్రంతో యువసుధ అంటూ కొత్త బ్యానర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా భాగస్వామిగా ఉంది. దేవర సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఇవీ చదవండి

English News