స్కంద ట్రైలర్ ఈవెంట్ తర్వాతే

రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన సినిమా స్కంద. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. బోయపాటి, రామ్ ఇమేజ్ లతో పోలిస్తే ఇది ఖచ్చితంగా డిఫరెంట్ కాంబినేషన్ అనిపించుకుంది. బోయపాటి సినిమా అంటే హీరో ఇమేజ్ ఏదైనా అది బోయపాటి స్టైల్లోనే ప్రెజెంట్ చేస్తాడు. అతని హీరోలు ఊరమాస్ గా ఉంటారు. కటౌట్ తో పనిలేకుండా వందలమందిని కొడుతూనే ఉంటారు. ముఖ్యంగా ఊరమాస్ ఆడియన్స్ కు బోయపాటి మూవీస్ అంటే ఫుల్ మీల్స్ లాంటివి అని చెప్పొచ్చు. అతని సినిమాలకు హిందీ డబ్బింగ్ మార్కెట్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది.

ఇక స్కందను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 15న విడుదల కాబోతోన్న ఈ చిత్ర ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ మరికొద్ది సేపట్లో జరగబోతోంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి శిల్ప కళా వేదికలో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ను ప్లాన్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఇలాంటి సందర్భాల్లో బాలయ్య కూడా కామన్ ఆడియన్స్ లాగా కాంబినేషన్ గురించి ఏమైనా అనేస్తాడా అనే ఉత్సుకత కూడా లేకపోలేదు.


ఇక ఈవెంట్ ఎర్లీగానే స్టార్ట్ అయినా.. ట్రైలర్ ను మాత్రం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. మామూలుగా ట్రైలర్ విడుదల చేసిన తర్వాత ఈవెంట్ ప్లాన్ చేసుకుంటే మాట్లాడేవారికీ కంటెంట్ ఉంటుంది. అలా కాకుండా ఆఖర్లో ప్లాన్ చేసుకున్నారు అంటే ముహూర్త బలం కోసమే అనుకోవచ్చు. సో.. రాత్రి 9 గంటల 9 నిమిషాలకు స్కంద మూవీ ట్రైలర్ విడుదలవుతుందన్నమాట.

Related Posts